ETV Bharat / sitara

ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన నితిన్​ 'మ్యాస్ట్రో'! - మ్యాస్ట్రో సినిమా

యువ కథానాయకుడు నితిన్​ నటిస్తున్న 'మ్యాస్ట్రో' చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయనున్నారని టాక్​ వినిపిస్తోంది. జూన్​ రెండో వారంలో షూటింగ్​ పూర్తి చేసి.. ఇదే నెలలో సినిమాను రిలీజ్​ చేయడానికి చిత్రబృందం ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Nithin's Maestro going to release on OTT ?
ఓటీటీ రిలీజ్​కు సిద్ధమైన నితిన్​ 'మ్యాస్ట్రో'!
author img

By

Published : May 31, 2021, 8:40 PM IST

Updated : May 31, 2021, 9:10 PM IST

ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు చిత్రాలతో సందడి చేశారు హీరో నితిన్‌. ఇప్పుడు ముచ్చటగా మూడో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉన్నారు. బాలీవుడ్ సూపర్​హిట్​ చిత్రం 'అంధాధున్​' తెలుగు రీమేక్​గా నితిన్​ ప్రధానపాత్రలో 'మ్యాస్ట్రో' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్​ మరో ఏడు రోజులు మాత్రమే మిగిలుందని టాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. జూన్​ రెండో వారంలో చిత్రీకరణ పూర్తి చేసుకొని.. ఓటీటీ ద్వారా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టాక్​. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. మహతి స్వరసాగర్​ సంగీతాన్ని అందిస్తున్నారు. నితిన్‌కు జోడీగా నభా నటేష్‌ నటిస్తోంది. తమన్నా ఓ ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఇటీవలే విడుదలైన నితిన్ ఫస్ట్​లుక్​, గ్లింప్స్​కు మంచి స్పందన లభిస్తోంది.

ఇదీ చూడండి: నితిన్ 'అంధాధున్' రీమేక్ టైటిల్ ఖరారు

Last Updated : May 31, 2021, 9:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.