టాలీవుడ్ హీరో నితిన్ జులై 26 రాత్రి(ఆదివారం) పెళ్లి చేసుకోనున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న చిత్రం 'రంగ్ దే'. అయితే తాజాగా ఈ నటుడి పెళ్లి సందర్భంగా చిత్రబృందం శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ టీజర్ ఆద్యంతం నితిన్ కామెడీతో సాగింది. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందులో పెళ్లి కొడుకెక్కడా అంటూ వచ్చే వాయిస్ ఓవర్ తో టీజర్ షురూ అయింది. నితిన్ నా బాయ్ ఫ్రెండ్ అని కీర్తి సురేశ్ ఆఫీసులో వారికి చెప్తుంటే.. మరోవైపు నితిన్ ఫైట్ చేస్తూ తను నా గర్ల్ ఫ్రెండ్ కాదని చెప్పాడు. చివరికి వద్దనుకుంటూనే కీర్తి మెడలో తాళి కట్టాడు. పెళ్లి చేసుకున్నాక ఇంట్లోని పనులతో ఓ భర్త పడే కష్టాలంటూ... నితిన్ పాత్ర ప్రేక్షకులను నవ్విస్తోంది.
వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశముందని చిత్రబృందం టీజర్లో తెలిపింది.
ఇది చూడండి : 'ఆన్లైన్ వేధింపులకు పాడాలి చరమగీతం'