యువ హీరో నితిన్, హీరోయిన్ కీర్తి సురేశ్ జంటగా తెరకెక్కనున్న సినిమా 'రంగ్‌దే'. 'గివ్ మీ సమ్ లవ్' అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా... విజయదశమి రోజున చిత్రీకరణ ప్రారంభించుకుంది.
సినిమా పూజా కార్యక్రమంలో చిత్ర బృందంతోపాటు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు దిల్‌రాజు, ఎస్.రాధాకృష్ణ (చినబాబు), జెమిని కిరణ్, సుధాకర్ రెడ్డి, హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. నితిన్, కీర్తిలపై ముహూర్తపు సన్నివేశానికి త్రివిక్రమ్ క్లాప్ కొట్టాడు. దిల్‌రాజు, చినబాబు కలిసి స్క్రిప్టును వెంకీ అట్లూరికి అందించాడు.
" ప్రేమతో కూడిన కుటుంబ కథా చిత్రమిది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు".
--వెంకీ అట్లూరి, సినీ దర్శకుడు
దసరా సందర్భంగా మంగళవారం రోజున ప్రారంభమైన ఈ చిత్రం...రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో నరేష్, రోహిణి, కౌసల్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, అభినవ్ గోమటం, సుహాస్ తదితరులు నటిస్తున్నారు. 2020 వేసవి కానుకగా చిత్రం విడుదల కాబోతోంది.
టైటిల్ కలిసొచ్చేలా...!
ఈ మధ్యకాలంలో నితిన్ చిత్రాలకు పాటల్లోని సాహిత్యాన్నే టైటిళ్లుగా పెడుతున్నారు. గతంలో ఈ యువ హీరో నటించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' (గబ్బర్ సింగ్‌లోని 'దిల్ సే' పాటలోని లిరిక్), 'చిన్నదాన నీకోసం' ( 'ఇష్క్' సినిమాలోని 'చిన్నదాన నీకోసం' లిరిక్) సినిమాల పేర్లు ఈ విధంగానే పెట్టారు. తాజాగా ప్రారంభమైన 'రంగ్ దే' కూడా 'అఆ' సినిమాలోని 'రంగ్ దే రే..' పాటలోని లిరిక్‌ను పోలి ఉంది.
-
#Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍
— nithiin (@actor_nithiin) June 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
#RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB
">#Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍
— nithiin (@actor_nithiin) June 24, 2019
#RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB#Nithiin29 is titled as RANG DE! Working with the Young n talented dir Venky atluri, costarring @KeerthyOfficial n produced by @vamsi84 @SitharaEnts AND cinematography by my ALL TIME FAV D.o.P @pcsreeram sir 😍😍😍😍😍😍😍
— nithiin (@actor_nithiin) June 24, 2019
#RangDe #gimmesomelove pic.twitter.com/NeaO2rllRB