నితిన్, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భీష్మ'. ఇందులోని సింగిల్స్ ఆంథమ్ వీడియోను ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటించే ఓ పోస్టర్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది చిత్ర బృందం. ఆ పోస్టర్లో బజాజ్ చేతక్‌పై స్టైల్‌గా దర్శనమిచ్చాడు నితిన్. ప్రస్తుతం ఈ పోస్టర్లో నితిన్ ఫోజు వైరల్ అవుతుంది.
ఈ పోస్టర్లో కుడివైపు తెల్ల రంగు, ఎడమ వైపు నీలం, ఎరుపు, పచ్చ రంగులు కలిసిన చొక్కాను ధరించి ఉంటాడు నితిన్. అయితే అది నాటి తరానికి చెందిన కాస్ట్యూమ్ కావడం వల్ల అందరి దృష్టి దానిపై పడింది. 1985లో వచ్చిన 'విజేత' చిత్రంలో మెగాస్టార్ ధరించిన చొక్కాను తలపిస్తుంది. దీంతో టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ సాగుతుంది. అప్పుడెప్పుడో చిరు వేసిన చొక్కాను మళ్లీ ఇప్పుడు నితిన్ ఎందుకు వేశాడు? ఆ సినిమాలోని ఏదైనా సన్నివేశాన్ని 'భీష్మ'లో నితిన్‌తో చేయిస్తున్నారా? అంటూ సందేహ పడుతున్నారు. దీనికి సమాధానం కావాలంటే ఈనెల 21 వరకు ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి: సాయితేజ్ నినాదం.. 'సోలో బ్రతుకే సో బెటర్'