ETV Bharat / sitara

కీర్తి సురేశ్​ మిస్సింగ్​పై నితిన్​ ట్వీట్​.. హైదరాబాద్​ పోలీస్​ రిప్లై! - కీర్తి సురేష్​ వార్తలు

హీరోయిన్​ కీర్తి సురేశ్​ మిస్సింగ్​ ఏంటీ? హైదరాబాద్​ పోలీసులు ఏమన్నారు అంటుకున్నారా? కంగారు పడకండి. నితిన్, కీర్తి సురేశ్​కు ఏమీ కాలేదు. వాళ్లిద్దరూ కలిసి నటించిన కొత్త చిత్రం 'రంగ్​దే'.. మార్చి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్​ జరుగుతోన్న నేపథ్యంలో హీరోయిన్​ కనిపించడం లేదని నితిన్​ ట్వీట్​ చేశారు. దానిపై స్పందించిన హైదరాబాద్​ పోలీస్ ట్విట్టర్​లో​ చమత్కరించారు.

Nithiin pulls Keerthy Suresh's leg, Hyd Police has a funny reply
నితిన్​కు అభయమిచ్చిన హైదరాబాద్​ పోలీస్​
author img

By

Published : Mar 21, 2021, 9:12 AM IST

నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం 'రంగ్‌ దే!'. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ ఒక ట్వీట్‌ చేశారు. "కనబడుట లేదు.. డియర్‌ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్‌" అంటూ ఆ ట్వీట్‌లో కీర్తి సురేశ్‌ చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు.

  • Don't worry @actor_nithiin we will take care😀

    — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) March 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

అయితే.. ఆ ట్వీట్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌లు స్పందించారు. "చింతించకండి నితిన్‌. మేము జాగ్రత్త తీసుకుంటాం" అంటూ బదులిచ్చారు. దీనిపై నవ్వుతున్న ఎమోజీలతో మళ్లీ నితిన్‌ స్పందించారు. పోలీసుల చమత్కారానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ఇదీ చూడండి: వాళ్లేం తినాలో అతను చెబుతాడు!

కీర్తి సురేశ్​ మిస్సింగ్​పై నితిన్​ ట్వీట్​.. హైదరాబాద్​ పోలీస్​ రిప్లై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.