ETV Bharat / sitara

Skylab Review: 'స్కైలాబ్' ప్రేక్షకులను ఆకట్టుకుందా?

skylab movie review: నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వైవిధ్యమైన సినిమా 'స్కైలాబ్'. ఈ చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఎవరెవరు ఎలా చేశారు? ప్రేక్షకులను ఆకట్టుకుందా? వంటి విషయాలు సమీక్ష ద్వారా తెలుసుకుందాం.

స్కైల్యాబ్​ మూవీ రివ్యూ, sky lab movie review
స్కైల్యాబ్​ మూవీ రివ్యూ
author img

By

Published : Dec 4, 2021, 2:19 PM IST

Skylab Movie Review 2021: న‌టీన‌టులు: నిత్యామేన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనూష త‌దిత‌రులు సాంకేతిక బృందం: సంగీతం: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి, ఛాయాగ్ర‌హ‌ణం: ఆదిత్య జవ్వాది, కూర్పు: రవితేజ గిరిజాల, ప్రొడక్షన్‌ డిజైన్‌: శివం రావ్‌, సౌండ్ రికార్డిస్ట్‌‌: నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి, సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌, కాస్ట్యూమ్స్‌: పూజిత తాడికొండ, సహ నిర్మాత: నిత్యామీనన్‌, నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు, మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు
సంస్థ‌: బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ
విడుద‌ల‌: 4 డిసెంబ‌ర్ 2021

1970 ద‌శ‌కం చివ‌ర్లో స్కైలాబ్ సృష్టించిన హ‌డావుడి అంతా ఇంతా కాదు. నాసా ప్ర‌యోగించిన ఆ అంత‌రిక్ష నౌక ఎప్పుడు మీద ప‌డిపోతుందో అంటూ కొన్ని దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు కొన్నాళ్ల‌పాటు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల‌దీశారు. ఆ గండం గ‌ట్టెక్కిన స‌మ‌యంలో పుట్టిన చిన్నారుల‌కు తెలుగు రాష్టాల్లో స్కైలాబ్ పేరుతో పేర్లుకూడా పెట్టుకున్నారు. కొన్ని ఊళ్లల్లో సంబ‌రాలు కూడా చేసుకున్నారు. అందులో క‌రీంన‌గ‌ర్ జిల్లా, బండ‌లింగంప‌ల్లి కూడా ఒక‌టి. ఆ ఊరి నేప‌థ్యంలోనే యువ ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ ఖండేరావు 'స్కైలాబ్‌' పేరుతో సినిమాను రూపొందించాడు. ఇటీవ‌ల చిత్ర‌సీమ‌కి న‌వ‌త‌రం కొత్త ఆలోచ‌న‌ల‌తో వ‌స్తోంది. అందుకు త‌గ్గ‌ట్టే చిత్ర ప‌రిశ్ర‌మ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. త‌రచూ భిన్న‌మైన ప్రేక్ష‌కుల ముందుకొస్తూ విజ‌యాన్ని అందుకుంటున్నాయంటే కార‌ణం అదే. మ‌రి 'స్కైలాబ్‌' కూడా ఆ జాబితాలో చేర‌బోతోందా? ఆస‌క్తి రేకెత్తించిన ప్ర‌చార చిత్రాల‌కి త‌గ్గ‌ట్టే సినిమా ఉందా? ఆ సంగ‌తులు తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం ప‌దండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
క‌థేంటంటే?
ఆనంద్ (స‌త్య‌దేవ్‌) వైద్యం చ‌దువుకున్న యువ‌కుడు. త‌న తాత‌గారి ఊరైన బండలింగంప‌ల్లికి వ‌స్తాడు. ఆ ఊరికి చెందిన సుబేదార్ రామారావు (రాహుల్ రామ‌కృష్ణ‌)తో ప‌రిచ‌యం పెంచుకుని క్లినిక్ ప్రారంభించే ప‌నిలో ఉంటాడు. సుబేదార్ రామారావుది మ‌రో క‌థ‌. ఒక‌ప్పుడు బాగా బ‌తికిన త‌న కుటుంబాన్ని క‌ష్టాల్లో నుంచి గ‌ట్టెక్కించ‌డం కోసం పోరాటం చేస్తుంటాడు. ఇద్ద‌రూ క్లినిక్ ప్రారంభిస్తారో లేదో ఆ వెంట‌నే ఊళ్లో స్కైలాబ్ ప‌డుతుందనే భ‌యాలు మొద‌ల‌వుతాయి. దాంతో వాళ్లిద్ద‌రి క‌థ మొద‌టికే వ‌స్తుంది. ఆ ఊరి దొర‌బిడ్డ గౌరి (నిత్య‌ామేన‌న్‌)ది ఇంకో క‌థ‌. ఆమె పాత్రికేయురాలిగా రాణించే ప్ర‌య‌త్నంలో ఉంటుంది. ఆ ఉద్యోగం లేక‌పోతే త‌న తండ్రి పెళ్లి చేసేస్తాడేమో అనే భ‌యం ఆమెది. ప‌ట్నం నుంచి ఊరికి వ‌చ్చిన గౌరి అక్క‌డి నుంచే వార్త‌లు రాయ‌డం మొద‌లు పెడుతుంది. కానీ ప‌త్రిక‌లో మాత్రం ప్ర‌చుర‌ణ కావు. మ‌రి ఆమె రాసిన క‌థ‌లు ఎప్పుడు ప్ర‌చుర‌ణ‌కి నోచుకున్నాయి? ఆనంద్ క్లినిక్ పెట్టాడా? రామారావు క‌ష్టాలు తీరాయా? స్కైలాబ్ భ‌యాలు ఆ ఊరిపై ఎలాంటి ప్ర‌భావాన్ని చూపించాయి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

అరుదైన నేప‌థ్యంతో కూడిన క‌థ ఇది. కామెడీతోపాటు బ‌ల‌మైన భావోద్వేగాలు, డ్రామాకి చోటుండేలా క‌థ‌ల్ని అల్లుకున్నాడు ద‌ర్శ‌కుడు. కానీ వాటిని తెర‌పైకి ప‌క్కాగా తీసుకురాలేక‌పోయారు. స‌గం సినిమా త‌ర్వాత కానీ అస‌లు క‌థ మొద‌లు కాక‌పోవ‌డం, ప్ర‌థ‌మార్థంలో సున్నిత‌మైన కామెడీ పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌క‌పోడం సినిమాకు మైన‌స్‌గా మారింది. ప‌తాక స‌న్నివేశాల‌కు ముందు క‌థ హృద‌యాల్ని కాస్త బ‌రువెక్కిస్తుంది. కానీ అప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్ట‌మంతా జ‌రిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇలాంటి క‌థ‌ల‌కు ర‌చ‌న‌, నిర్మాణం ప‌రంగా తీసుకోవ‌ల్సిన జాగ్ర‌త్త‌లు చాలా కీల‌కం. ఆ విష‌యంలో చిత్ర‌బృందం చేసిన ప్ర‌య‌త్నం మెచ్చుకోద‌గ్గ స్థాయిలోనే ఉంటుంది. స‌హ‌జ‌మైన మాట‌లు, మూడు ప్ర‌ధాన పాత్ర‌ల క‌థ‌లు, 1970 ద‌శ‌కాన్ని గుర్తు చేసేలా స‌హ‌జ‌మైన వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన తీరు, సంగీతం.. ఇలా అన్నీ మెచ్చుకోద‌గ్గ స్థాయిలోనే ఉంటాయి. కానీ ఆరంభంలోనే పాత్ర‌ల్ని ప‌రిచ‌యం చేయ‌డానికి బోలెడంత స‌మ‌యం తీసుకోవ‌డం, ఆయా స‌న్నివేశాలు మ‌రీ బ‌ద్ధ‌కంగా ముందుకు సాగ‌డం వల్ల సినిమా ఏ ద‌శ‌లోనూ ర‌క్తిక‌ట్ట‌దు. ప్ర‌ధాన పాత్ర‌లకు సెప‌రేట్‌గా క‌థ‌లు ఉన్నా, అవి భావోద్వేగాల ప‌రంగా మాత్రం పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. ఊళ్లో స్కైలాబ్ హ‌డావుడి మొద‌లు కావ‌డం నుంచే కాస్త క‌థ‌లో వేగం పుంజుకుంటుంది. భయం బ‌తుకుని ఎలా నేర్పుతుంద‌నే విష‌యాల్ని ప‌తాక స‌న్నివేశాల్లో చ‌క్క‌గా ఆవిష్క‌రించారు. డ‌బ్బున్నోళ్లంతా వాటిని కాపాడుకోవ‌డం కోసం దాక్కోవ‌డం, లేనివాళ్లంతా త‌మ త‌మ చిన్న చిన్న కోరిక‌లు తీర్చుకోవ‌డం, ద‌ళితులు దేవాల‌యాల్లోకి ప్ర‌వేశించ‌డం, ఆ నేప‌థ్యంలో పండే భావోద్వేగాలు హ‌త్తుకుంటాయి. క‌చ్చితంగా ఇదొక కొత్త ర‌క‌మైన సినిమానే. ఆస్వాదించ‌డానికి కాస్త ఓపిక కావాలంతే.

ఎవ‌రెలా చేశారంటే?

నిత్య‌ామేన‌న్ న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. గౌరి పాత్ర‌లో ఆమె చ‌క్క‌గా ఒదిగిపోయింది. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆమె భాగ‌స్వామి కావ‌డం వల్ల అంద‌రిలోనూ ఆస‌క్తి వ్య‌క్త‌మైంది. ఆమె ఈ క‌థ‌ను ఎంత‌గా న‌మ్మారో ఆమె న‌ట‌న, తెర‌పై క‌నిపించిన విధానం స్ప‌ష్టం చేసింది. స‌త్య‌దేవ్, రాహుల్ రామ‌కృష్ణ వాళ్ల పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. ఇద్ద‌రూ కూడా ప‌తాక స‌న్నివేశాల్లో సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపించారు. గౌరి అసిస్టెంట్‌గా క‌నిపించే విష్ణు, తుల‌సి, త‌నికెళ్ల భ‌ర‌ణి త‌దిత‌రులు త‌మ పాత్ర‌ల ప‌రిధి మేరకు న‌టించారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ ప‌నిత‌నం ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ క‌నిపిస్తుంది. అప్ప‌టి వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబించిన తీరు చాలా బాగుంటుంది. ప్ర‌శాంత్ ఆర్‌. విహారి నేప‌థ్య సంగీతంతోపాటు పాట‌లు కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. ఆదిత్య కెమెరా ప‌నిత‌నం కూడా మెప్పిస్తుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. సినిమాకు స్ప‌ష్ట‌త అవ‌స‌రం. కానీ ద‌ర్శ‌కుడు విశ్వ‌క్ ఆ విష‌యంలో మ‌రీ ఎక్కువ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్టు అనిపిస్తోంది. చిన్న చిన్న పాత్రల్ని కూడా మ‌రీ డీటెయిల్డ్‌గా మ‌లిచే ప్ర‌య‌త్నం చేశారు. కానీ ఆయ‌న ఎంచుకున్న నేప‌థ్యం, ఆయ‌న ర‌చ‌న‌లోని ప్ర‌తిభ మాత్రం ఆక‌ట్టుకుంటుంది.

+ బ‌లాలు
ప‌తాక స‌న్నివేశాలు
1970ల వాత‌వ‌ర‌ణం
నిత్య‌ామేన‌న్, స‌త్యదేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ‌ల న‌ట‌న
- బ‌ల‌హీన‌త‌లు
సాగ‌దీత‌గా అనిపించే స‌న్నివేశాలు
ప్ర‌థ‌మార్థంలో కామెడీ
చివ‌రిగా: స్కైలాబ్‌... కొత్త ప్ర‌య‌త్న‌మే కానీ!

ఇదీ చూడండి: Skylab review: 'స్కైలాబ్' మూవీ.. ఆడియెన్స్ రియాక్షన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.