స్వీటీ అనుష్కశెట్టి నటిస్తున్న సినిమా 'నిశ్శబ్దం'. థ్రిల్లర్ కథతో తెరకెక్కించారు. ట్రైలర్ను హీరో నాని.. ట్విట్టర్లో నేడు విడుదల చేశాడు. ఆద్యంతం ఉత్కంఠ కలిగిస్తూ అంచనాల్ని పెంచుతోందీ చిత్రం. ఇందులో అనుష్క.. మాట్లాడలేని ఓ అమ్మాయి పాత్రలో కనిపించనుంది.
ఐదు భాషల్లో వచ్చే నెల 2న విడుదల కానుందీ చిత్రం. ఇందులో మాధవన్, హాలీవుడ్ నటుడు మైకేల్ మ్యాడ్సన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందించాడు. హేమంత్ మధుకర్ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">