అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో అగ్ర కథానాయికగా మారింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు ఆమె తమ్ముడు కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతుంది. అమన్, సిద్దిక జంటగా రూపొందుతున్న చిత్రం 'నిన్నే పెళ్లాడతా'. సాయి కుమార్ ముఖ్య భూమిక షోషిస్తున్నాడు. రెండు పాటలు మినహా చిత్రీకరణ అంతా పూర్తయింది.
తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది చిత్రబృందం. డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో సాయి కుమార్ నటన ప్రధానాకర్షణగా నిలుస్తుందని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా ఉంటుందని నిర్మాతలు అన్నారు.
ఇవీ చూడండి.. 'ఖైదీ' దర్శకుడితో పనిచేసేందుకు సూర్య గ్రీన్‌సిగ్నల్