ETV Bharat / sitara

'ఎక్స్​ట్రాక్షన్​' ట్రైలర్​: నైజీరియా కుర్రాళ్ల వెర్షన్ - ఎక్స్​ట్రాక్షన్ ట్రైలర్

హాలీవుడ్ నటుడు క్రిస్ హేమ్స్​వర్త్​, బాలీవుడ్ నటులు రణ్​దీప్ హుడా, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఎక్స్​ట్రాక్షన్'. నెట్​ఫ్లిక్స్​లో విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్​ను మక్కీకిమక్కీగా చిత్రీకరించారు కొందరు నైజీరియా కుర్రాళ్లు. ఈ వీడియోను షేర్ చేస్తూ వారి పని తీరును మెచ్చుకున్నాడు హేమ్స్​వర్త్.

Nigeria boys recreate Extraction trailer
'ఎక్స్​ట్రాక్షన్​' ట్రైలర్​: నైజీరియా కుర్రాళ్ల వెర్షన్
author img

By

Published : Jun 26, 2020, 5:05 PM IST

ప్రముఖ హాలీవుడ్‌ నటుడు క్రిస్‌ హేమ్స్​వర్త్, బాలీవుడ్‌ నటులు రణ్​దీప్‌ హుడా, పంకజ్ త్రిపాఠి కలిసి నటించిన చిత్రం 'ఎక్స్‌ట్రాక్షన్‌'. సామ్‌ హార్‌గ్రేవ్‌ దర్శకత్వంలో తెరకెక్కింది. ఏప్రిల్‌ 24, 2020న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను అనుసరించి మక్కీకిమక్కీగా నైజీరియా దేశానికి చెందిన కుర్రాళ్లు హేమ్స్​వర్త్​, మిగతా నటీనటులుగా అలాంటి సీన్లనే తమదైన రీతిలో చిత్రీకరించారు. ఈ వీడియోను చూసిన క్రిస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ట్రైలర్‌ షాట్‌ను అప్‌లోడ్ చేసి షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.

ఈ సందర్బంగా హేమ్స్​వర్త్​ స్పందిస్తూ.. "మా నిజమైన ట్రైలర్‌ వెర్షన్ కన్నా మీరు తీసిన ట్రైలర్‌ వెర్షన్‌ బాగుందని అనుకుంటున్నా.." అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.