ETV Bharat / sitara

'రాబర్ట్'​ ఓటీటీ రిలీజ్​ డేట్​.. 'ఏక్‌ మినీ కథ' సాంగ్ - రాబర్ట్ మూవీ ఓటీటీ రిలీజ్

రాబర్ట్​​ సినిమా ఓటీటీ రిలీజ్​ డేట్​ ఖరారైంది. సంతోష్‌‌, కావ్య జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఏక్‌ మినీ కథ'లో ఓ పాట విడుదలై ఆకట్టుకంటోంది.

robert, ek mini katha
రాబర్ట్, ఏక్ మినీ కథ
author img

By

Published : Apr 21, 2021, 6:08 PM IST

'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్‌ కుమారుడు సంతోష్‌‌, కావ్య జంటగా నటిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం 'ఏక్‌ మినీ కథ'. కార్తిక్‌ రాప్రోలు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర నుంచి ఓ సరికొత్త పాటను చిత్రబృందం బుధవారం షేర్‌ చేసింది. 'స్వామి రంగా పరేషాన్‌ ఈ జీవితం' అంటూ సాగే ఈ పాట ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. యూవీ కాన్సెప్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ కథ అందించారు. ప్రవీణ్​ లక్కరాజు సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. శ్రద్ధాదాస్‌, బ్రహ్మాజీ, సుదర్శన్‌, సప్తగిరి, పోసాని కృష్ణ మురళీ కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కన్నడ స్టార్‌ దర్శన్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం 'రాబర్ట్‌'. తెలుగులోనూ ఇదే పేరుతో విడుదలై పాజిటివ్​ టాక్​ తెచ్చుకుంది. ఆశాభట్‌ నాయిక. ఇప్పుడీ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అమేజాన్​ ప్రైమ్​లో ఏప్రిల్​ 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ఈ చిత్రంలో వినోద్‌ ప్రభాకర్‌, జగపతిబాబు, రవి శంకర్‌ తదితర తారాగణం కీలక పాత్రలు పోషించారు. తరుణ్‌ కిశోర్‌ సుధీర్‌ దర్శకుడు.

ఇదీ చదవండి : 'దోస్తానా 2'కు అక్షయ్​ గ్రీన్​సిగ్నల్​ ఇస్తాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.