ETV Bharat / sitara

క్రిస్మస్​ బరిలో బడా సినిమాలు.. బాక్సాఫీసుకు పండగే! - జెర్సీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది?

గతేడాది క్రిస్మస్​ సందర్భంగా కొత్త సినిమాల సందడి లేనేలేదు. అయితే ప్రస్తుతమున్న అనుకూల పరిస్థితుల నేపథ్యంలో భారీ చిత్రాలు ఆకట్టుకోనున్నాయి. వీటిలో.. రణ్​వీర్​ సింగ్ నటించిన '83'తో పాటు.. వరుణ్ తేజ్ 'గని', నాని ద్విపాత్రాభినయం చేస్తున్న 'శ్యామ్ సింగరాయ్' వంటి చిత్రాలున్నాయి.

ranveer
రణ్​వీర్
author img

By

Published : Nov 20, 2021, 7:09 AM IST

సినిమా విడుదలంటే సవాలక్ష లెక్కలుంటాయి. మామూలు రోజుల్లో సినిమా విడుదల చేయడానికీ పండగ వేళ ప్రేక్షకుల ముందుకు తేవడానికి చాలా తేడా ఉంటుంది. అందుకే మన దర్శకనిర్మాతలు పర్వదినాల్లో సినిమాల్ని ప్రదర్శించడానికి ఆసక్తిగా సిద్ధమవుతుంటారు. ఈ ఏడాది దసరా, దీపావళి సందడి ముగిసింది. దీపావళికి బాక్సాఫీసు ముందుకొచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'సూర్యవంశీ' బాక్సాఫీసు వద్ద హిట్‌గా నిలిచింది. కరోనా దెబ్బకు నష్టాల ఊబిలో కూరుకుపోయిన థియేటర్లకు పాత వైభవాన్ని తీసుకొచ్చాయి ఈ చిత్ర వసూళ్లు. ఏడాది చివర్లో వచ్చే పండగ క్రిస్మస్‌. గత ఏడాది కరోనా కారణంగా క్రిస్మస్‌కు థియేటర్లలో సందడి లేదు. ఈ ఏడాది భారీ బాలీవుడ్‌ చిత్రం థియేటర్లకు రానుంది. ఆ సందడిని కొనసాగిస్తూ ఏడాది చివర్లో మరో చిత్రం సిద్ధమవుతోంది. తెలుగులోనూ రెండు క్రేజీ సినిమాలు విడుదలవుతున్నాయి.

గత ఏడాది క్రిస్మస్‌కు ఓటీటీలోనే వినోదాల్ని ఆస్వాదించవలసి వచ్చింది ప్రేక్షకులు. వరుణ్‌ధావన్‌ 'కూలీ నెం.1' చిత్రంతో పాటు మరిన్ని ఓటీటీలో సందడి చేశాయి. 2019లో అక్షయ్‌కుమార్‌ నటించిన 'గుడ్‌న్యూస్‌' క్రిస్మస్‌ కానుకగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. ఈసారి క్రిస్మస్‌కు డిసెంబరు 24న ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమవుతోంది '83'. ఆ తర్వాత 31న 'జెర్సి' రానుంది. విశేషం ఏంటంటే రెండు చిత్రాలు క్రికెట్‌ నేపథ్యంతో కూడినవే. కానీ ఈ ఏడాది క్రిస్మస్‌ బరిలోకి వద్దాం అనుకున్న ఆమిర్‌ఖాన్‌ చిత్రం 'లాల్‌ సింగ్‌ ఛద్దా' వచ్చే ఏడాదికి వెళ్లిపోయింది.

వరుణ్‌.. నాని హంగామా..

varun nani
వరుణ్-నాని

తెలుగులో క్రిస్మస్‌ వేళ రెండు చిత్రాలు అలరించనున్నాయి. డిసెంబరు 24న 'గని', 'శ్యామ్‌ సింగరాయ్‌' చిత్రాలు రానున్నాయి. గద్దలకొండ గణేష్‌ తర్వాత వరుణ్‌తేజ్‌ నుంచి వస్తోన్న చిత్రం 'గని'. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సయీమంజ్రేకర్‌ కథా నాయిక. నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న చిత్రం 'శ్యామ్‌సింగరాయ్‌' సాయిపల్లవి కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బంగాల్‌ నేపథ్యం ఉన్న ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటోంది. 'టాక్సీవాలా'తో విజయం అందుకున్న రాహుల్‌ సంకృత్యాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దీపావళితో మొదలైన బాక్సాఫీసు మెరుపులు క్రిస్మస్‌కు రెట్టింపు అవుతాయనే నమ్మకంతో అటు బాలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లు ఎంతో ధీమాగా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే థియేటర్లకు పాత వైభవం తిరిగి రావడం మొదలైనట్టే.

2020 క్రిస్మస్‌కు అనుకుంటే..

ranveer
రణ్​వీర్

రణ్‌వీర్‌సింగ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం '83'. భారత క్రికెట్‌ జట్టు 1983లో సాధించిన ప్రపంచ కప్పు విజయం నేపథ్యంలో సాగే చిత్రమిది. రణ్‌వీర్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌గా ఆయన భార్య రోమీ భాటియాగా దీపికా పదుకొణె నటించారు. ప్రముఖ దర్శకుడు కబీర్‌ఖాన్‌ తెరకెక్కించిన ఈ సినిమా 2019 జూన్‌లో మొదలైంది. 2020 ఏప్రిల్‌ 10న విడుదల అనుకున్నా కరోనా కారణంగా ఆ ఏడాది డిసెంబరు 25కి తేదీ మారింది. అప్పటికీ పరిస్థితులు అనుకూలించక ఈ ఏడాది జూన్‌ 4న విడుదల అని ప్రకటించారు. ఎక్కువ రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్సీ అమల్లో ఉండటంతో మళ్లీ వాయిదా వేసి డిసెంబరు 24 అని ప్రకటించారు. ఈ తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారే అవకాశం లేదని చిత్రబృందం చెబుతోంది. 'సూర్యవంశీ' ఇచ్చిన ఉత్సాహంతో ఈ సినిమాని భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేస్తున్నారు. '83' విజయంపై బాలీవుడ్‌ వ్యాపార వర్గాలు చాలా నమ్మకంగా ఉన్నాయి.

shahid
షాహిద్​ కపూర్

తెలుగు దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన 'జెర్సి' చిత్రం అదే పేరుతో హిందీలోనూ రూపొందింది. ఆయనే ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. షాహిద్‌కపూర్‌ కథానాయకుడిగా నటించాడు. 'అర్జున్‌రెడ్డి' హిందీ రీమేక్‌ 'కబీర్‌సింగ్‌'గా మెప్పించిన షాహిద్‌ ఈ చిత్రంపైనా భారీ ఆశలే పెట్టుకున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.