విభిన్నమైన కథలకు ప్రాధాన్యం ఇస్తున్న కథానాయిక రెజీనా. 'అ!' నుంచి ఆమె కథల ఎంపిక శైలి మారింది. 'ఎవరు' తర్వాత రెజీనా తెలుగులో నటిస్తున్న చిత్రం 'నేనే నా..?!'. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను కథానాయకుడు వరుణ్‌తేజ్ విడుదల చేశాడు. చిత్రబృందానికి గుడ్‌లక్ చెప్పాడు. ఈ తొలిరూపులో రెజీనా ఇనుప రేకులతో కప్పి ఉన్న ఓ సన్నని గదిలో బంధించి ఉన్నట్లు కనిపించింది. ఆమె ఒంటికి రక్తం, కళ్లలో ఏదో బాధ ఉన్నట్లు తెలుస్తోంది. కథపై ఆసక్తిని పెంచేలా ఉన్న ఈ ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. అంతేకాదు రెజీనా ఓ రాణి గెటప్‌లో కనిపించింది. మరి ఇందులో తన పాత్ర గురించి తెలియాలంటే వేచిచూడాల్సిందే.
'నేనే నా..?!' సినిమాకు కార్తిక్ రాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఆపిల్ ట్రీ స్టూడియోస్ పతాకంపై రాజ్ శేఖర్ వర్మ నిర్మిస్తున్నాడు. ఇందులో మిగిలిన తారాగణం వివరాలు తెలియాల్సి ఉంది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఇదీ చూడండి : 'మనం' దర్శకుడితో మరోసారి నాగచైతన్య!