వికాస్ భాల్ దర్శకత్వంలో బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, హీరోయిన్ రష్మిక నటిస్తున్న చిత్రం 'గుడ్‌బై'. ఈ చిత్రంలో తాను నటించనున్నట్లు తెలిపారు సీనియర్ నటి నీనా గుప్తా. బిగ్‌బీ భార్య పాత్ర పోషిస్తున్నట్లు వెల్లడించారు. ఆయనతో కలిసి నటించడమనేది తన కల అని చెప్పారు. ఈ చిత్రంలో అవకాశం రావడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సినిమా కథ తనకెంతో నచ్చిందని అన్నారు.
నీనా గుప్తా.. వరిగా 'శుభ్ మంగళ్ జ్యాదా సావ్‌ధాన్' అనే బాలీవుడ్ చిత్రంలో నటించారు. ప్రస్తుతం 'గ్వాలియర్', 'సర్దార్ కా గ్రాండ్సన్' సినిమాల్లో నటిస్తున్నారు.
![amitab](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/collage053_0604newsroom_1617707089_114.jpg)
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి : బిగ్‌బీ- దీపిక కాంబోలో మూడో సినిమా