యాంకర్ ప్రదీప్ హీరోగా తొలిసారి నటిస్తున్న సినిమా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?'. ఇప్పటికే విడుదల కావాల్సిన.. కరోనా ప్రభావంతో వాయిదా పడింది. అయితే అందులోని రొమాంటిక్ సాంగ్ 'నీలి నీలి ఆకాశం' మాత్రం రికార్డులు సృష్టిస్తోంది. చిత్రం విడుదలకు ముందే 200 మిలియన్ల వ్యూస్ పొందిన తొలి దక్షిణాది గీతంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని చిత్రబృందం పంచుకుంది.
అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం.. వినసొంపుగా ఉండి, శ్రోతల మనసుల్ని మీటింది. అందుకే లాక్డౌన్లో పదేపదే ఈ పాటనే వినేలా చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా అమృత అయ్యర్ నటిస్తోంది. మున్నా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్వీ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">