ETV Bharat / sitara

సుశాంత్‌ కేసు: షౌవిక్, శామ్యూల్​కు ఐదు రోజుల రిమాండ్ - సుశాంత్ ఆత్మహత్య కేసు

సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐతో పాటు ఎన్​సీబీ విచారణ జరుగుతోంది. తాజాగా ఈ డ్రగ్స్​తో సంబంధం ఉన్నట్లు గుర్తించిన రియా చక్రవర్తి సోదరుడు షౌవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండాను అధికారులు అరెస్ట్ చేశారు. వీరికి సెప్టెంబర్ 9 వరకు రిమాండ్ విధించింది కోర్టు.

సుశాంత్‌ కేసు
సుశాంత్‌ కేసు
author img

By

Published : Sep 5, 2020, 3:08 PM IST

నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌, నటి రియా చక్రవర్తికి డ్రగ్స్‌ సరఫరా చేసిన కేసులో రియా సోదరుడు షౌవిక్‌, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరండాలను అరెస్టు చేసిన మాదకద్రవ్యాల నియంత్రణ బ్యూరో (ఎన్‌సీబీ) వారిని కోర్టు ఎదుట హాజరుపరిచింది. వీరితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఇందులో షౌవిక్, శామ్యూల్, బాంద్రా ప్రాంతంంలో నివసించే పరిహార్​కు కోర్టు సెప్టెంబర్ 9 వరకు ఎన్​సీబీ కస్టడీలో ఉంచుకునే అవకాశం కల్పించింది. కైజన్ ఇబ్రహీంకు మాత్రం 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతంరం వీరిని మరలా కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది.

ఇదే కేసులో మరో ముగ్గురు జైద్‌ విలాత్ర, అబ్బాస్‌ లఖాని, కరన్‌ అరోరాను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. లఖాని, అరోరాలనుంచి అధికారులు మాదకద్రవ్యాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫుడ్‌ బిజినెస్‌లో తీవ్రంగా నష్టపోవడం వల్ల డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు విలాత్ర విచారణలో ఒప్పుకున్నాడు. మాదకద్రవ్యాల సరఫరాలో ఇబ్రహీం, పరిహార్‌తో తనకు సంబంధాలున్నట్లు వెల్లడించాడు.

షౌవిక్‌ చక్రవర్తి ఆదేశాల మేరకే విలాత్ర, ఇబ్రహీం నుంచి డ్రగ్స్‌ సేకరించి సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ మిరాండాకి అందించేవాడినని పరిహార్‌ అధికారుల విచారణలో పేర్కొన్నాడు. మార్చి 17న షౌవిక్‌ చక్రవర్తి.. మిరాండాకు విలాత్ర సెల్‌ నంబర్‌ను పంపించి 5 గ్రాముల డ్రగ్స్‌కు రూ.10 వేలు చెల్లించాల్సిందిగా సూచించాడు. కాగా ఆ చాట్‌ను అధికారులు గుర్తించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.