మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi movies) చెల్లెలుగా నయనతార నటించడం ఖరారైంది! నయన్ పుట్టినరోజు(nayanthara birthday) సందర్భంగా 'గాడ్‌ఫాదర్'(godfather movie) చిత్రబృందం ఆమెకు విషెస్ చెబుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.
మలయాళ చిత్రం 'లూసిఫర్'కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒరిజినల్లో మంజూ వారియర్ చేసిన పాత్రనే తెలుగులో నయన పోషిస్తోంది. ఈ చిత్రంలో ఈమెకు రెండోభర్తగా యువనటుడు సత్యదేవ్(satyadev movies) కనిపించనున్నారు. ఇతడే ప్రతినాయకుడు కూడా!
సత్యదేవ్‌కు భార్యగా నటించేందుకు నయన్(chiranjeevi nayanthara movies list) తొలుత ఒప్పుకోలేదని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజం లేదని తేల్చిన చిత్రబృందం.. సదరు వదంతులకు చెక్ పెట్టింది. వీరిద్దరూ జనవరి నుంచి షూటింగ్‌కు వస్తారని సమాచారం.
ఇంతకుముందు 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో(sye raa narasimha reddy full movie) చిరు, నయన్ జంటగా నటించారు. కానీ ఇందులో వీరిద్దరూ ఎలాంటి రొమాంటిక్ సీన్లు లేవు.
తమిళస్టార్ డైరెక్టర్ మోహన్‌రాజా 'గాడ్‌ఫాదర్' సినిమాకు(chiranjeevi godfather movie) దర్శకత్వం వహిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూర్చుతున్నారు. సూపర్‌గుడ్ ఫిల్మ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది వేసవికి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మరోవైపు చిరంజీవి 'ఆచార్య' పూర్తిచేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న థియేటర్లలోకి రానుంది. అలానే 'భోళాశంకర్'(bhola shankar 2021) షూటింగ్‌లోనూ పాల్గొంటున్నారు. ఇందులో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేశ్ చేస్తోంది. బాబీ దర్శకత్వంలోనూ చిరు చేయాల్సిన ఓ సినిమా.. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది.
ఇవీ చదవండి: