ETV Bharat / sitara

నటుడు నవాజుద్దీన్​ భార్య వాంగ్మూలం నమోదు - nawazuddin siddiqui wife updates

బాలీవుడ్​ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ భార్య అలియా అతనిపై ఇటీవలే పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఆదివారం ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు బుధానా పోలీసులు.

Nawazuddin
నవాజుద్దీన్
author img

By

Published : Sep 13, 2020, 8:57 PM IST

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్​ సిద్దిఖీపై అతని భార్య అలియా ఇటీవలే పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై ఆదివారం అలియా వాంగ్మూలాన్ని తీసుకున్నట్లు ముజఫర్​నగర్​లోని బుధానా పోలీసులు తెలిపారు. ఇందుకోసం ఆమె ముంబయి నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు.

జులై 27న అలియా తన భర్త, అతని కుటుంబ సభ్యులపై ముంబయి పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసు బుధానా పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుందని.. ఎఫ్​ఐఆర్​ను అక్కడికి పంపించారు. ఇందులో తన భర్త సోదరుడు మిన్హాజుద్దిన్​ తనపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ విషయాన్ని అత్తమామలకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందని ఫిర్యాదులో పేర్కొంది.

లాక్​డౌన్​ విధించినప్పటి నుంచి నవాజుద్దీన్​ తన స్వస్థలమైన బుధానాలోనే ఉంటున్నారు. అయితే అలియా తన వాంగ్మూలాన్ని సమర్పించేందుకు వచ్చిన సమయంలో.. అతను దెహ్రాదూన్​​లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలియా తమను కలిసేందుకు ఎప్పుడూ రాలేదంటూ.. ఆమె ఆరోపణలను నవాజుద్దీన్​ కుటుంబం ఖండించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.