ETV Bharat / sitara

కథ విని షాకయ్యా: నవీన్ చంద్ర - నవీన్ చంద్ర ఇంటర్వ్యూ

హీరోగా, విలన్​గా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ నటుడు నవీన్ చంద్ర. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన 'మోసగాళ్లు' చిత్రంలో కీలకపాత్ర పోషించాడు నవీన్. ఈ సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో మీడియాతో ముచ్చటించిన ఈ నటుడు పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Naveen Chandra about Mosagallu movie
నవీన్ చంద్ర
author img

By

Published : Mar 9, 2021, 6:40 AM IST

"నేనెప్పుడూ మంచి కథల్లో భాగమవ్వాలని కోరుకుంటా. నా పాత్ర ఏంటి? తెరపై ఎలా కనిపిస్తా? అన్నది అసలు పట్టించుకోను. నా దృష్టిలో కథే నాకు హీరో" అంటున్నాడు నవీన్‌ చంద్ర. ఓ వైపు హీరోగా నటిస్తూనే.. ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అందరినీ మెప్పిస్తున్నాడు నవీన్‌. ప్రస్తుతం 'మోసగాళ్లు' చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించాడు. విష్ణు హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రమిది. ఈనెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నాడు నవీన్‌ చంద్ర.

"యథార్థంగా జరిగిన ఓ భారీ ఐటీ కుంభకోణం కథాంశంతో రూపొందిన చిత్రం 'మోసగాళ్లు'. ఈ కథ విన్నాక.. అది రూ.2,800కోట్ల కుంభకోణమని తెలిసి షాకయ్యా. ఇదంతా ఓ అక్కాతమ్ముడు కలిసి చేశారని తెలిసి మరింత ఆశ్చర్యపోయా. ఈ సినిమాలో ఆ అక్క, తమ్ముడి పాత్రల్లో కాజల్‌, మంచు విష్ణు నటించారు. నేను వాళ్లకు సహాయపడే కజిన్‌ పాత్రను పోషించా. ఈ స్కామ్‌లో ఓ సూత్రధారి నవదీప్‌ అయితే.. దాన్ని ఎవరికీ దొరక్కుండా ఎలా చేయాలి? అని ప్రణాళిక రచించేది నా పాత్ర".

"నేనీ రంగంలోకి అడుగుపెట్టినప్పుడు నా లక్ష్యం ఒకటే.. 'మంచి నటుడు అనిపించుకోవాలి'. కొందరు నన్ను హీరోగా చూపించారు. మరికొందరు ప్రతినాయకుడిగా మార్చారు. ఇంకొందరు సహాయ నటుడ్ని చేశారు. నాతో ఏం చేయించినా మంచి కథల్లో భాగం చేసి నందుకు ఆనందంగా అనిపిస్తుంటుంది. ఓ నటుడిగా నాలోని విభిన్న కోణాల్ని ఆవిష్కరించగలుగుతున్నందుకు సంతృప్తిగా ఉంది. అదృష్టమేంటంటే.. నేనిప్పటి వరకు పోషించిన పాత్రలన్నీ కథల్ని నడిపించినవే తప్ప, ఏదో ఉన్నాయంటే ఉన్నాయనే తరహావి మాత్రం కాదు".

"ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ 'గని', రానా 'విరాటపర్వం' చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నా. హీరోగా 'అర్ధశతాబ్దం'తో పాటు యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. అలాగే నేను, అవికా గోర్‌ జంటగా బెక్కం వేణుగోపాల్‌ నిర్మాణంలో ఓ చిత్రం చేశాం. ఆర్కా మీడియాలో ఒక వెబ్‌సిరీస్‌ చేస్తున్నా. దీంతో పాటు తెలుగు, తమిళంలో కొన్ని మంచి సినిమాలు చేస్తున్నా".

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.