రామ్‌చరణ్.. ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఆలియా భట్, ఒలివియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే 75శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
తాజాగా యువ హీరో నవదీప్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటో పెట్టగా దానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ఫొటోలో నవదీప్ కండలు తిరిగిన దేహంతో కోరమీసాలతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. ఈ నేపథ్యంలో ఆ లుక్ చూసిన ఓ నెటిజన్ 'ఆర్‌ఆర్‌ఆర్'లో నటిస్తున్నారా? అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌పై నవదీప్ బదులిస్తూ.. 'అలాంటిది ఏం లేదు' అని క్లారిటీ ఇచ్చాడు.