నవరసాలను ఒక్కో కథగా చెబుతూ మణిరత్నం సృష్టించిన వెబ్‌సిరీస్ 'నవరస'. సూర్య, అరవింద స్వామి, సిద్ధార్థ్, విజయ్‌సేతుపతి, యోగిబాబు, రేవతి, అధర్వ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియాకు తమవంతు సాయం చేయడానికి నటీనటులు, సాంకేతిక బృందం ఇందులో భాగస్వాములు అయ్యారు. ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా పనిచేశారు.
ఇటీవల నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మేకింగ్ వీడియోను పంచుకుంది. ఒక్కో ఎపిసోడ్‌ను ఎలా తెరకెక్కించారు? అసలు 'నవరస' వెనుక ఏం జరిగింది? మీరూ చూసేయండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: