జాతీయ చలనచిత్ర అవార్డులను మే నెల తర్వాతే ప్రకటించనుంది ప్రభుత్వం. ఎన్నికల నిబంధనావళి అమల్లో ఉండడమే ఇందుకు కారణం.
ప్రత్యేకమైన జ్యూరీ సభ్యులు సినీ రంగంలో కృషి చేసిన, ప్రతిభ చూపించిన వ్యక్తులకు ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు. వీటిని ప్రతి ఏడాది ఏప్రిల్లో ప్రకటించేవారు. అయితే 17వ లోక్సభ ఎన్నికల తరుణంలో అవార్డుల ప్రకటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సమాచార, ప్రసార శాఖ.
'ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉంది. అయితే ఈ అవార్డులను రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది. మీడియా ప్రభావం పెరుగుతుంది. కాబట్టి ఎన్నికల తర్వాత అవార్డులు ప్రకటిస్తాం' అని ఉత్తర్వులలో వివరించింది ప్రభుత్వం.
ఎన్నికల ప్రవర్తన నియమావళి మే 23న తుది ఫలితాలు వచ్చే వరకు అమలులోనే ఉంటుంది. ఈ తేదీ తర్వాతే అవార్డుల ప్రకటన తేదీ వెలువడనుంది.