తెలుగు సినీ నటీనటుల సంఘం నూతన అధ్యక్షుడు నరేశ్ ప్రమాణస్వీకారం చేశారు. నరేశ్ ప్రమాణ స్వీకారం తీరును ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తప్పుపట్టారు. నరేశ్ మాట్లాడిన ప్రతి మాటలో నేను అనే పదం ఉందని, ఎక్కడా మేము అనడం లేదని రాజశేఖర్ అభ్యంతరం తెలిపారు. అంతా ఒక్కటిగానే గెలిచామని అన్నాడు.
నరేశ్ పని ఒత్తిడి వల్లే "నేను" అని అన్నారని జీవితరాజశేఖర్ వివాదాన్ని సద్దుమణిగించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మైక్ తీసుకొని మాట్లాడబోతున్న హేమను నరేశ్ వారించారు. ఆమె చేతుల్లోని మైక్ లాక్కున్నారు. దీంతో హేమ 'మా' అసోసియేషన్ గురించి నరేశ్ చెప్పిన విషయాలన్నీ ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలేనని, మా కార్యవర్గంలోని 26 మందిని సంప్రదించకుండా ప్రకటన చేశారని మండిపడింది.