ETV Bharat / sitara

'నాకు నేను నచ్చలేదు అందుకే ఇలా​' - నారా రోహిత్ తాజా వార్తలు

ఫిట్​గా మారి, మీసకట్టుతో ఉన్న కొత్త లుక్​లో ఆకట్టుకుంటున్నాడు యువ కథానాయకుడు నారా రోహిత్​. అయితే ఎందుకు ఇలా మారాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, తనపై తొలి షాట్​ తీసిన ఈరోజున అధికారిక ట్విట్టర్​ ఖాతాను ప్రారంభించాడు.

Nara Rohith opens up about his striking new makeover
నారా రోహిత్
author img

By

Published : May 5, 2020, 11:01 AM IST

Updated : May 5, 2020, 12:49 PM IST

టాలీవుడ్​ హీరో నారా రోహిత్.. కొత్త లుక్​తో అదరగొట్టాడు. బొద్దుగా ఉన్న ఇతడు.. ఇటీవలే ఫిట్​గా మారి, కోర మీసంతో కనువిందు చేశాడు. ఈ ఫొటోను తాజాగా ఇన్​స్టాలో పంచుకున్నాడు. అయితే తను ఇలా ఎందుకు మారాల్సి వచ్చిందో.. ఈ మధ్య కాలంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

పాతలుక్ తనకు తాను​ అసలు నచ్చలేదని, అందుకే ఫిట్​గా కనిపించేందుకు ఏడాది నుంచి కసరత్తులు చేస్తూ ఇలా మారినట్లు రోహిత్ తెలిపాడు. లాక్​డౌన్​తో జిమ్​ మూతపడటం వల్ల ఇంట్లోనే డైట్​ పాటిస్తూ వ్యాయామాలు చేస్తున్నట్లు వెల్లడించాడు.

నారా రోహిత్.. ట్విట్టర్​లోకి ఎంట్రీ ఇచ్చాడు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం, ఇదే రోజు తనపై తొలి షాట్​ తీశారని చెబుతూ, అందుకు సంబంధించిన ఓ ఫొటోను పంచుకున్నాడు. పెదనాన్న చంద్రబాబు, అన్న లోకేశ్​తో కలిసి ట్విట్టర్​లో ఉండటం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు.

  • On this day in 2009, this was my first shot from Banam ... On this Occasion, It's an honor and pleasure to join twitter alongside my Mentor and Pedha nanna @ncbn garu and my Dearest @naralokesh anna !

    As the great saying goes "Family is not Biology, it's Loyalty" pic.twitter.com/XkicJoJc2x

    — Rohith Nara (@IamRohithNara) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'బాణం' సినిమాతో టాలీవుడ్​లోకి అరంగేట్రం చేశాడు రోహిత్​. 'సోలో'తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం వైవిధ్యభరిత చిత్రాల్లో నటిస్తూ, మెప్పించాడు. గతకొద్ది కాలం నుంచి నటనకు దూరంగా ఉన్న ఇతడు.. చివరిసారిగా 2018లో వచ్చిన 'వీరభోగవసంత రాయులు'లో కనిపించాడు. ప్రస్తుతం 'అనగనగా దక్షిణాదిలో', 'శబ్దం', 'పండగలా వచ్చాడు', 'మదరాసి' ప్రాజెక్టులు చేస్తున్నాడు. ప్రస్తుతం అవి చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Last Updated : May 5, 2020, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.