ETV Bharat / sitara

వచ్చే వారం నుంచి 'వి' సందడి షురూ - V MOVIE IN OTT

ఓటీటీలో 'వి' సినిమా త్వరలో స్ట్రీమింగ్​ కానుంది. ట్రైలర్​ను వచ్చే వారం విడుదల చేయనున్నారు. ఇందులో నాని విలన్​గా నటించడం విశేషం.

వచ్చే వారం నుంచి 'వి' సందడి షురూ
వి సినిమాలో నాని-సుధీర్​బాబు
author img

By

Published : Aug 17, 2020, 8:11 AM IST

థియేటర్లు మూతపడటం వల్ల సినీ ప్రేమికులకు ఓటీటీ వేదికలే ప్రత్యామ్నాయంగా మారాయి. ఆ ఆదరణ దృష్ట్యా కొత్త సినిమాలు నేరుగా వాటిల్లోనే విడుదలవుతున్నాయి. అయితే తెలుగులో ఇప్పటివరకూ పరిమిత వ్యయంతో తీసిన సినిమాలే ఈ వైపు వెళ్లాయి. ఎక్కువ బడ్జెట్​తో తీసిన చిత్రాలు థియేటర్ల కోసం ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం, ఒకవేళ తెరుచుకున్నా ప్రేక్షకులు మునుపటి స్థాయిలో వస్తారో లేదో అనే భయాలు నెలకొన్నాయి. దాంతో ఎక్కువ వ్యయంతో రూపొందిన సినిమాలు కూడా ఓటీటీలవైపు అడుగులేస్తున్నాయి. అందులో 'వి' కూడా ఉంది. నాని-సుధీర్​బాబు కథానాయకులు. మోహన్​కృష్ట ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. దిల్​రాజు నిర్మాత. త్వరలో ఈ చిత్ర సందడి షురూ కానుంది. వచ్చే వారం ట్రైలర్​ విడుదల కానుంది. ఆ కసరత్తులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాని ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.