నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'శ్యామ్ సింగరాయ్'. 'ట్యాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృిత్యాన్ దర్శకత్వం వహించారు. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియిన్ ఇతర హీరోయిన్లుగా చేశారు. సోమవారంతో ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. త్వరలో ట్రైలర్‌తో పాటు విడుదల తేదీపై స్పష్టతనిచ్చే అవకాశముంది.
![syam singharoy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_cinema-1.jpg)
![syam singharoy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_cinema-3.jpg)
సిద్ధార్థ్ మల్హోత్రా సైనికుడిగా నటిస్తున్న చిత్రం 'షేర్షా'. కార్గిల్ వార్‌లో వీరమరణం పొందిన విక్రమ్బత్రా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఆగస్టు 12 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో 'షేర్షా' స్ట్రీమింగ్ కానుంది. కియారా అడ్వాణీ హీరోయిన్. విష్ణువర్ధన్ దర్శకుడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కొరియన్ చిత్రం 'మిడ్ నైట్ రన్నర్స్' తెలుగులో రీమేక్ చేస్తున్నారు. రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్-క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ విషయాన్ని చెబుతూ ఓ ఫొటోను విడుదల చేశారు.
![niveda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_cinema-2.jpg)
సందీప్ కిషన్, బాబీ సింహా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం 'గల్లీ రౌడీ'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్‌ను అందుకుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఆగస్టులో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. నేహా శెట్టి హీరోయిన్. కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.
![gallirowdy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_cinema-4.jpg)
కన్నడ సూపర్‌స్టార్ రాజ్‌కుమార్ మనవరాలు ధనయ రామ్‌కుమార్ వెండితెర అరగేట్రంకు రంగం సిద్ధమైంది. త్వరలో ఓ తమిళ సినిమాతో హీరోయిన్గా పరిచయం కానుంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
![dhanya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_dhanay-1.jpg)
![dhanya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_dhanay-3.jpg)
![dhanya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_dhanay-2.jpg)
![dhanya](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12575639_dhanay-4.jpg)
ఇదీ చూడండి: బికినీ పోజులతో అలజడి రేపుతున్న డ్యాన్సర్