ETV Bharat / sitara

'శ్యామ్‌ సింగరాయ్‌' అందుకే మరింత స్పెషల్​: నాని

Singharoy Trailer Release: తాను నటించిన 'శ్యామ్​సింగరాయ్'​ సినిమా చూసిన ప్రతిఒక్కరూ సంతృప్తి చెందుతారని అన్నారు హీరో నాని. ఈ చిత్రం కోసం తమ చిత్రబృందం చాలా కష్టపడిందని చెప్పారు.

నాని శ్యామ్​సింగరాయ్​ ట్రైలర్​, nani shyam singharoy trailer
నాని శ్యామ్​సింగరాయ్​ ట్రైలర్​
author img

By

Published : Dec 15, 2021, 6:33 AM IST

Singharoy Trailer Release: "తెలుగు సినిమా ఉన్నంత కాలం.. మ్యూజిక్‌ ఉన్నంత కాలం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు జీవించే ఉంటారు. ఆయన ఆఖరి పాట మా 'శ్యామ్‌ సింగరాయ్‌'లో ఉండటం వల్ల ఈ సినిమా మరింత స్పెషల్‌గా మారిపోయింద"న్నారు నాని. ఆయన కథానాయకుడిగా రాహుల్‌ సంకృత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. వెంకట్‌ బోయనపల్లి నిర్మించారు. సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా ఈనెల 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్మాత దిల్‌రాజు చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.. "ఒక మంచి సినిమా చేశాక.. మనసులో ఓ నిండు గర్వం కనిపిస్తుంది. 'శ్యామ్‌ సింగరాయ్‌' చేశాక నాకలాంటి అనుభూతే కలిగింది. కచ్చితంగా చెబుతున్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సంతృప్తిగా బయటకు వెళ్తారు. రాహుల్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఈ సినిమాలో దేవీ మీద ఓ పాట రాశారు. దేవీ మీద రాసిన పుస్తకాలన్నీ 45రోజుల పాటు చదివి ఆ పాట రాశానని శాస్త్రి గారు చెప్పారు. దేవీ పాటలో సాయిపల్లవి డ్యాన్స్‌ మరింత ఆకట్టుకుంటుంది. తన పాత్ర చాలా బాగుంటుంది. కీర్తిగా కృతి అద్భుతంగా నటించింది. నిర్మాత వెంకట్‌తో నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు.. ఇంకా సుదీర్ఘంగా సాగుతుంది. ఈ చిత్రంతో ఎడిటర్‌ నవీన్‌ నూలి మరో నేషనల్‌ అవార్డు అందుకుంటాడని ఆశిస్తున్నా. అద్భుతమైన సెట్స్‌ వేసిన అవినాష్‌కు థ్యాంక్స్‌. అందరి కష్టంతోనే ఇలాంటి చిత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాం. గర్వంగా చెబుతున్నా.. ఈ క్రిస్మస్‌ మనదే" అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

దిల్‌రాజు మాట్లాడుతూ.. "దర్శకుడు, నిర్మాత కొత్తవాళ్లైనా.. నాని తన అనుభవంతో భుజస్కందాలపై పెట్టుకుని పూర్తి చేశారు. కచ్చితంగా నాని నమ్మకం నిజమవుతుందని అనిపిస్తోంది" అన్నారు.

సాయిపల్లవి, మాట్లాడుతూ.. "మా చిత్రంతో పాటు రాబోయే అన్ని సినిమాల్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా" అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత నిర్మాత వెంకట్‌ బోయనపల్లి, కృతిశెట్టి తదితరులు పాల్గొని మాట్లాడారు.

ఇదీ చూడండి: భుజం ఎత్తడం వల్ల నాకు ఆ సమస్య వచ్చింది: అల్లు అర్జున్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.