ETV Bharat / sitara

'శ్యామ్‌ సింగరాయ్‌' ట్రైలర్‌.. 'వాలిమై' మేకింగ్​ వీడియో - వాలిమై

Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని నటించిన 'శ్యామ్‌ సింగరాయ్‌' ట్రైలర్​ విడుదలైంది. ద్విపాత్రభినయంలో నాని అదరగొట్టాడు. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన 'వాలిమై' మేకింగ్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

shyam singha roy release date
శ్యామ్‌ సింగరాయ్‌
author img

By

Published : Dec 14, 2021, 9:32 PM IST

Shyam Singha Roy: నాని ద్విపాత్రాభినయం చేసిన పవర్‌ఫుల్‌ చిత్రం 'శ్యామ్‌ సింగరాయ్‌'. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం వరంగల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించింది. ఇందులో భాగంగా ట్రైలర్‌ని విడుదల చేసింది. నాని అభిమానులు కోరుకునే అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తుంటే అర్థమవుతోంది. టైటిల్‌ పాత్రలో నాని ఒదిగిన తీరు విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆయన చెప్పిన ప్రతి డైలాగ్‌ చప్పట్లు కొట్టించేలా ఉంది. ముగ్గురు నాయికలు ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 1970ల కాలం నాటి కథతో కోల్‌కతా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి మిక్కీ జె. మేయర్‌ సంగీతం అందించారు. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

valimai making video: అదిరిపోయిన మేకింగ్​ వీడియో..

తమిళ స్టార్​ హీరో అజిత్​ నటిస్తున్న కొత్త సినిమా 'వాలిమై'(ajith valimai update). ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్​ వీడియోను రిలీజ్​ చేసింది చిత్రబృందం. టాలీవుడ్​ యువహీరో కార్తికేయ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. అజిత్‌కు(ajith kumar valimai release date) జోడీ హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్​ కానుందీ చిత్రం.

ఇదీ చూడండి: Bheemla Nayak: రానాకు 'భీమ్లా నాయక్' సర్​ప్రైజ్​.. వీడియో అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.