'బాహుబలి' ప్రభాస్ హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం 'సాహో.' ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది ఈ చిత్రబృందం. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు సాహోను తీసుకురానుంది. అయితే అదే రోజున రావాల్సిన సినిమాలు ఇప్పటికే బరి నుంచి తప్పుకున్నాయి. తాజాగా నాని హీరోగా రూపొందిన 'గ్యాంగ్‌లీడర్'.. తేదీ మార్చుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు నేచురల్ స్టార్.
"సాహో మన చిత్రం. ఆ సినిమా హిట్ అయితే మేం పండగ చేసుకుంటాం. ప్రభాస్ అన్నకు, చిత్రబృందానికి శుభాకాంక్షలు. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలని ఆశిస్తున్నా. గ్యాంగ్‌లీడర్ విడుదల తేదీ శుక్రవారం ప్రకటిస్తా". -ట్విట్టర్లో హీరో నాని.
'గ్యాంగ్‌లీడర్'లో ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రియాంక మోహన్ హీరోయిన్. విక్రమ్ కె కుమార్ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇది చదవండి: ఆగస్ట్ 10న ట్రైలర్‌తో వస్తున్న సాహో