నేచురల్ స్టార్ నాని నటించనున్న కొత్త ప్రాజెక్టు 'శ్యామ్ సింగరాయ్'. 'టాక్సీవాలా'తో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. మేలో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
అయితే ఈ సినిమా కథను నాని రూ.50 లక్షలు పెట్టి కొన్నాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్ వద్ద ఈ కథను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. నానికి కథ బాగా నచ్చడం వల్ల ఎక్కువ మొత్తం ఇచ్చి తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చేంత వరకు వేచిచూడాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాని ప్రస్తుతం 'వి' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుధీర్‌బాబు మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. నివేదా థామస్, అదితిరావు హైదరి కథానాయికలు. దీంతోపాటు 'నిన్నుకోరి' ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీశ్' చేస్తున్నాడు.
ఇదీ చూడండి.. 'శ్యామ్ సింగరాయ్'గా నేచురల్ స్టార్ నాని