ETV Bharat / sitara

Nani Next Movie: తెలంగాణ యాసలో హీరో నాని డైలాగులు! - శ్యామ్ సింగరాయ్​ చిత్రం

'శ్యామ్​ సింగరాయ్​'(Shyam Singha Roy Movie News), 'అంటే సుందరానికి'(Ante Sundaraniki Movie News) చిత్రాలతో బిజీగా ఉన్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani Movies).. ప్రస్తుతం మరో కొత్త సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. ఈ కొత్త చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. దసరాకి ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.

Nani
నాని
author img

By

Published : Sep 17, 2021, 7:06 AM IST

Updated : Sep 17, 2021, 10:13 AM IST

కొత్త దర్శకుల్ని, కొత్తదనం నిండిన కథల్ని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు కథానాయకుడు నాని(Nani Next Movie). ఇటీవలే 'టక్‌ జగదీష్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన.. ప్రస్తుతం 'శ్యామ్‌ సింగరాయ్‌'(Shyam Singha Roy Movie Update), 'అంటే సుందరానికి'(Ante Sundaraniki Movie Update) చిత్రాలతో సెట్స్‌పై బిజీగా ఉన్నారు. ఇవి చేతిలో ఉండగానే.. ఆయన కొత్త కబురు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం దసరాకి ముహూర్తం ఖరారు చేశారు.

నాని(Natural Star Nani New Movies) చేయనున్న ఈ కొత్త చిత్రంతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయం కానున్నట్లు సమాచారం. గ్రామీణ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్‌ డ్రామా కథాంశంతో ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం నాని తొలిసారి తెలంగాణ యాసలో సంభాషణలు పలకనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దసరా రోజునే చిత్ర టైటిల్‌తో పాటు ఇతర వివరాల్ని ప్రకటించనున్నారు. ఈ సినిమాను సుధాకర్‌ చెరుకూరి నిర్మించనున్నారు.

ఇదీ చదవండి: Friday Movie: అటు థియేటర్, ఇటు ఓటీటీ.. సందడే సందడి!

Last Updated : Sep 17, 2021, 10:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.