బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరో నాని. ప్రస్తుతం 'వి', 'టక్ జగదీష్' షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న ఇతడు... తన పుట్టినరోజు కానుకగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్తో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పాడు. దీనికి 'శ్యామ్ సింగరాయ్' అనే క్రేజీ టైటిల్ పెట్టారు. కాన్సెప్ట్ వీడియోనూ విడుదల చేశారు.
ఈ వీడియోలో నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. టైపు యంత్రంపై నిర్మాత, దర్శకుడు, హీరో పేర్లను చూపించారు. దీనిబట్టి ఈ సినిమా ఓ సరికొత్త కథతో తీస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">