ETV Bharat / sitara

నాని కాస్త డిఫరెంట్​.. సినిమా కోసం ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ - nani nazriya movie

Nani new movie: నాని కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. అయితే తమ సినిమా ఈ తేదీల్లో రిలీజ్ చేస్తామంటూ ఏకంగా ఏడు విడుదల తేదీలను ప్రకటించారు.

nani new movie
నాని న్యూ మూవీ
author img

By

Published : Feb 3, 2022, 7:17 PM IST

RRR movie: కరోనా వల్ల టాలీవుడ్​ అల్లకల్లోలమైపోయింది. 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్' భారీ సినిమా రిలీజ్​ డేట్స్​ ఫిక్స్​ చేసుకోవడం.. సరిగ్గా ఆ టైమ్​కు కరోనా కొత్త వేరియెంట్​ రావడం.. ఆ సినిమాలు కాస్త వాయిదా పడటం. గత కొన్నాళ్లుగా ఇదే తంతు.

ఈ సంక్రాంతికి కూడా సేమ్ అలానే జరిగింది. 'ఆర్ఆర్ఆర్' జనవరి 7, 'రాధేశ్యామ్' జనవరి 14 రిలీజ్ కావాల్సింది. కానీ ఒమిక్రాన్ ప్రభావం, పలు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత కారణంగా ఆయా చిత్రాల్ని వాయిదా వేశారు. ఇటీవల కొత్త విడుదల తేదీలను ప్రకటించారు.

ఈ సినిమాలు మళ్లీ వాయిదా పడితే.. మా సినిమాలకు ఇబ్బంది తలెత్తకూడదని భావించిన కొన్ని సినిమాలు రెండు రెండు రిలీజ్​ డేట్స్​ను ఈ మధ్య ప్రకటించాయి. వాటిలో 'భీమ్లా నాయక్', 'ఆచార్య', 'రామారావు ఆన్ డ్యూటీ' లాంటి సినిమాలు ఉన్నాయి.

Nani ante sundaraniki movie: ఇప్పుడు వీటన్నింటి కంటే కాస్త డిఫరెంట్​గా ఆలోచిన నాని 'అంటే సుందరానికీ' టీమ్.. ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ ప్రకటించింది. అవన్నీ సమ్మర్​లోనే ఉన్నాయి. కాకపోతే ఏ రోజు సినిమాను థియేటర్లలో విడుదల చేస్తారనేది మాత్రం త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు.

రొమాంటిక్ కామెడీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే మలయాళ బ్యూటీ నజ్రియా.. తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.