హీరో నాగశౌర్య నటించిన చిత్రం 'అశ్వథ్థామ' జనవరి 31 న విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాల గురించి ఈటీవీ భారత్తో పంచుకున్నాడు ఈ యువహీరో.
"ఈ మధ్య కాలంలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి. అయితే, తమపై జరిగిన దాడిని గురించి చెప్పేందుకు కొంతమందే ధైర్యంగా బయటికొస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా కథ రాసేందుకు ఎంతో కష్టపడ్డాం. జిల్లాలు, రాష్ట్రాలు దాటి చాలామంది ఇళ్లకు వెళ్లి కలిశాం. ఈ విషయం చెప్పగానే ఎక్కువమంది తలుపులు తీయడానికి కూడా ఇష్టపడలేదు. నాకు తెలిసిన ఓ అమ్మాయి విషయంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. నాకు ప్రతి సంవత్సరం రాఖీ కట్టే ఓ చెల్లి గురించి కూడా ఈ సినిమాలో ఉంటుంది. నా కెరీర్‌లో ఇంత ఎమోషనల్ సినిమా ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి విషయాల్లో నేరుగా సమాజంలోకి వెళ్లి ఏం చేయలేం. సమాజంలో ఉన్న పరిస్థితిని సినిమా ద్వారా చెప్పాలనుకున్నాం. మీరంతా చూసిన తర్వాత ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతాయా? అని మీకు కూడా అనిపిస్తుంది. ఈ చిత్రం వ్యక్తిగతంగా నాకేంతో దగ్గరైంది. అందుకే ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండేలా నా గుండెపై పచ్చబొట్టు వేయించుకున్నా."
- నాగశౌర్య, కథానాయకుడు
నాగశౌర్య హీరోగా, నూతన దర్శకుడు రమణ తేజ డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం 'అశ్వథ్థామ'. మెహరీన్ కథనాయిక.
ఇదీ చూడండి... 'మ్యాన్ వర్సెస్ వైల్డ్' చిత్రీకరణలో రజనీకి గాయాలు!