ETV Bharat / sitara

విల్లు ఎక్కుపెట్టిన నాగశౌర్య.. ఆసక్తిగా ధనుశ్​ సినిమా ట్రైలర్​ - tolywood latest updates

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో నాగశౌర్య 'లక్ష్య' రిలీజ్​ డేట్​, ధనుశ్​-అక్షయ్​ నటించిన 'అత్రాంగి రే' ట్రైలర్​, 'మంచి రోజులు వచ్చాయి' ఓటీటీ విడుదల తేదీ వివరాలు ఉన్నాయి.

నాగశౌర్య లక్ష్య రిలీజ్​ డేట్​, nagshourya lakshya movie release date
నాగశౌర్య లక్ష్య రిలీజ్​ డేట్​
author img

By

Published : Nov 24, 2021, 8:29 PM IST

naga shourya lakshyam movie release date: హీరో నాగశౌర్య నటించిన లక్ష్య సినిమా ఎట్టకేలకు రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. డిసెంబరు 10న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాల భైరవ బాణీలు సమకూరుస్తున్నారు. నారాయణదాస్‌ కె.నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలువిద్య నేపథ్యంలో స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య ఆరుపలకల దేహంతో కనిపించనున్నారు.

నాగశౌర్య లక్ష్య రిలీజ్​ డేట్​, nagshourya lakshya movie release date
నాగశౌర్య లక్ష్య రిలీజ్​ డేట్​

ట్రైలర్

కోలీవుడ్​ స్టార్​ ధనుశ్​, బాలీవుడ్ హీరో అక్షయ్​ కుమార్, సారా అలీ ఖాన్ కలిసి నటించిన చిత్రం 'అత్రాంగి రే'(dhanush new movie atrangi re) ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి ఆనంద్​ ఎల్​ రాయ్​ దర్శకత్వం వహించగా.. ఏ ఆర్​ రెహమాన్ సంగీతం అందించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఓటీటీలో

సంతోష్‌ శోభన్, మెహరీన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం 'మంచి రోజులు వచ్చాయి'(manchi rojulu vachayi movie ott release date). ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన ఈ చిత్రం అతి త్వరలో డిజిటల్‌ మాధ్యమంలో సందడి చేయనుంది. ఓటీటీ 'ఆహా'లో డిసెంబరు 3 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. యూవీ కాన్సెప్ట్స్‌, మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థలు నిర్మించిన ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, సప్తగిరి, వైవా హర్ష, అజయ్‌ ఘోష్‌, ప్రవీణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: నాలుగేళ్లు ఆస్పత్రిలోనే.. ఆమె వల్లే బతికా!: దర్శకుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.