సినిమాల విడుదల విషయంలో చాలా పక్కాగా ఉంటారు అగ్రకథానాయకుడు నాగార్జున. ఆయన కుమారుల కొత్త చిత్రాల రిలీజ్‌పైనా అంతే శ్రద్ధ చూపిస్తారు. నాగచైతన్య ఇప్పటికే తనకంటూ గుర్తింపు తెచ్చుకోగా.. అఖిల్ మాత్రం సరైన హిట్ కోసం ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు.
లాక్డౌన్ నేపథ్యంలో చిత్రాలను ఓటీటీల్లో విడుదల చేయాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారు. అయితే తన కుమారుల కొత్త సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయొద్దని సదరు నిర్మాతలతో నాగ్ మాట్లాడని సమాచారం.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'లవ్‌స్టోరీ' తెరకెక్కుతుండగా.. అఖిల్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాణంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రం రూపొందుతోంది. ఈ రెండు సినిమాలను థియేటర్లలో మాత్రమే విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాతలకు నాగార్జున సూచించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.