కింగ్ నాగార్జున 'శివ'.. టాలీవుడ్లో ఎవర్గ్రీన్ సినిమాల జాబితాలో ముందువరుసలో ఉంటుంది. హీరోగా అతడి గుర్తింపును అమాంతం పెంచేసింది. రామ్‌గోపాల్ వర్మ లాంటి విభిన్నమైన దర్శకుడ్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అయితే ఈ విషయాలన్ని ఇప్పుడు చెబుతున్నాను ఎందుకని అనుకుంటున్నారా! అందుకు ఓ కారణం ఉంది. ఈ చిత్రం విడుదలై ఇప్పటికీ 30 ఏళ్లు పూర్తయింది.
మాఫియా నేపథ్యంలో కాలేజీ కుర్రాళ్ల మధ్య జరిగే రాజకీయాలపై తీసిన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. హీరో నాగార్జునకు ఎనలేని పేరు తీసుకొచ్చింది. ప్రతినాయకుడిగా రఘవరన్, అతడికి సహాయకుడిగా తనికెళ్ల భరణి ఆకట్టుకునే నటన ప్రదర్శించారు. జేడీ చక్రవర్తి, ఉత్తేజ్, చిన్నా తదితరులు సహాయ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇళయరాజా సంగీతం ప్రత్యేకార్షణగా నిలిచింది. 'బోటనీ క్లాసు ఉంది' అనే పాట ఇప్పటికీ శ్రోతల మదిని దోచేస్తోంది.
ఈ చిత్రానికిగానూ 1989లో రామ్‌గోపాల్ వర్మ నంది అవార్డు అందుకోగా, హీరో నాగార్జున ఫిలింఫేర్ సొంతం చేసుకున్నాడు.
ఇది చదవండి: అక్కినేని నాగేశ్వరరావు: ఆయన ఓ నటశిఖరం.. ఎంతో మందికి స్ఫూర్తిదాయకం