ETV Bharat / sitara

అలరిస్తున్న నాగ్​ 'బంగార్రాజు' ట్రైలర్​ - బంగార్రాజు ట్రైలర్​

Nagarjuna Bangarraju trailer: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్ర ట్రైలర్​ విడుదలైంది. ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

Nagarjuna Bangarraju trailer
బంగార్రాజు ట్రైలర్​ వచ్చేసింది
author img

By

Published : Jan 11, 2022, 5:07 PM IST

Nagarjuna Bangarraju trailer: అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రచారంలో జోరు పెంచిన చిత్రబృందం.. తాజాగా ట్రైలర్​ను విడుదల చేసింది. నాగార్జున అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఈ సినిమాలో ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. తండ్రీకొడుకులిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి ఫిదా చేస్తున్నారు. ఇద్దరి హీరోల యాస, మ్యానరిజం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. పల్లెటూరి నేపథ్యంలో సాగే సన్నివేశాలు, ఉర్రూతలూగించే పాటల క్లిప్‌లతో ఈ ట్రైలర్‌ పండగ శోభను ముందుగానే తీసుకొచ్చిందనిపిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

2016 సంక్రాంతి కానుకగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన'.. అద్భుతమైన విజయం సాధించింది. ఈ కుటుంబ కథా పల్లెటూరి చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందులో నాగ్​ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా చేశారు. స్పెషల్ సాంగ్​లో అనసూయ, హంస నందిని లాంటి బ్యూటీస్ అదరగొట్టేశారు. ఇప్పుడీ చిత్రానికే సీక్వెల్​గా రూపొందింది 'బంగార్రాజు'. కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ఈ సినిమాలో నాగ్​తో పాటు నాగ చైతన్య, హీరోయిన్ కృతి శెట్టి, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. స్పెషల్​ సాంగ్​లో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా.. నాగ్-చైతూతో కలిసి డ్యాన్స్​ చేసింది. మీనాక్షి దీక్షిత్, దర్శనా బనిక్, వేదిక, దక్ష నగర్కర్, సిమ్రత్ కౌర్​ కూడా అతిథి పాత్రల్లో మెరిసి సందడి చేశారు.

ఇదీ చూడండి: 'బంగార్రాజు' మామూలోడు కాదు! ఎనిమిది మంది హీరోయిన్లతో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.