Nagarjuna bangarraju movie: ఈసారి సంక్రాంతికా 'బంగార్రాజు' సందడి చేయనుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ఫుల్‌గా జరుగుతున్నాయి. 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకు సీక్వెల్‌గా తీసిన ఈ సినిమాలో ఓ విషయం తెగ ఆసక్తి కలిగిస్తోంది. అదే హీరోయిన్లు.
2016 సంక్రాంతి కానుకగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన'.. అద్భుతమైన విజయం సాధించింది. ఈ కుటుంబ కథా పల్లెటూరి చిత్రం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. అందులో నాగ్ సరసన రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా చేశారు. స్పెషల్ సాంగ్‌లో అనసూయ, హంస నందిని లాంటి బ్యూటీస్ అదరగొట్టేశారు.
మరి ఈ సినిమా సీక్వెల్ 'బంగార్రాజు'లో అంతకంటే ఎక్కువమందే ఉన్నారు. తొలిపార్ట్‌లో కనిపించిన రమ్యకృష్ణతో ఈసారి కొత్తగా కృతిశెట్టి హీరోయిన్గా చేసింది. ఇందులో నాగచైతన్య సరసన ఆమె కనిపించనుంది. స్పెషల్ సాంగ్‌లో 'జాతిరత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా.. నాగ్-చైతూతో కలిసి డ్యాన్స్ చేసింది.
వీళ్లే కాకుండా మీనాక్షి దీక్షిత్, దర్శనా బనిక్, వేదిక, దక్ష నగర్కర్, సిమ్రత్ కౌర్ కూడా అతిథి పాత్రల్లో మెరిసి సందడి చేయనున్నారు. హీరోయిన్లు కాకుండా మరో ఆరుగులు ముదుగుమ్ములు ఈ సినిమాలో తమ అందచందాలతో అదరగొట్టనున్నారు.
ఈ సినిమా కూడా పూర్తి పల్లెటూరి నేపథ్యంగానే సాగనుంది. అనూప్ రూబెన్స్ సంగీతమందించారు. తొలిపార్ట్ తీసిన కల్యాణ్‌కృష్ణ.. సీక్వెల్‌కూ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మించారు. జనవరి 14న థియేటర్లలోకి రానుందీ చిత్రం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: