రౌడీపిల్ల సాయిపల్లవి తన ప్రియుడితో కలిసి దుబాయ్ వెళ్లింది. ఈరోజు నుంచి మరికొన్ని రోజుల పాటు ఆమె అక్కడే తన ప్రియుడితో కలిసి చక్కర్లు కొట్టబోతుంది. ఇంతకీ ఆమె ప్రేమించిన ఆ కుర్రాడు మరెవరో కాదు అక్కినేని నాగచైతన్య. ప్రస్తుతం వీళ్లిద్దరు ప్రేమికులుగా నటిస్తోన్న 'లవ్‌స్టోరీ' చిత్రం కోసమే ఈ ప్రేమ యాత్ర.
'ఫిదా' వంటి హిట్ తర్వాత దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి వస్తోన్న చిత్రమిది. ఇందులో చైతూ తెలంగాణ ప్రాంతానికి చెందిన దళిత కుర్రాడిగా దర్శనమివ్వబోతున్నాడట. సాయిపల్లవి ఓ అగ్రవర్ణానికి చెందిన ధనిక యువతిగా కనిపించనుందని సమాచారం. వీళ్లిద్దరి మధ్య నడిచే ప్రేమకథతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర కొత్త షెడ్యూల్ దుబాయ్‌లో ప్రారంభమైంది.
మరికొన్ని రోజుల పాటు చైతూ-సాయిపల్లవితో పాటు ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను ఓ పాటను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.
ఇదీ చూడండి : రామ్‌చరణ్‌కు ఆ 'డ్రైవింగ్ లైసెన్స్'తో సంబంధం లేదట!