ETV Bharat / sitara

వరుణ్​​ పెళ్లిపై నెటిజన్​ కామెంట్​.. నాగబాబు కౌంటర్​! - వరుణ్​తేజ్​ పెళ్లిపై నాగబాబు

మెగాప్రిన్స్​ వరుణ్​తేజ్​ పెళ్లి గురించి వస్తున్న రూమర్లపై సోషల్​మీడియాలో ఆయన తండ్రి నాగబాబు స్పందించారు. వరుణ్​-సాయిపల్లవికి పెళ్లి చేసేస్తానంటూ ఓ నెటిజన్​ కామెంట్​ చేయగా.. దానిపై నాగబాబు సరదాగా కౌంటర్​ ఇచ్చారు.

Nagababu counter to netizen who asked for Varun Tej and Saipallavi wedding
వరుణ్​​ పెళ్లిపై నెటిజన్​ కామెంట్​.. నాగబాబు కౌంటర్​
author img

By

Published : Apr 7, 2021, 12:53 PM IST

వరుణ్‌తేజ్‌ - సాయిపల్లవిల వివాహం గురించి నటుడు నాగబాబు స్పందించారు. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తరచూ ఇన్‌స్టాగ్రామ్​ వేదికగా నెటిజన్లతో ఆయన మమేకం అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఇన్‌స్టా చాట్‌లో వరుణ్‌తేజ్‌ వివాహం గురించి ఓ నెటిజన్‌ నాగబాబును ప్రశ్నించారు. దానికి ఆయన ఇచ్చిన కౌంటర్‌ అందర్నీ ఎంతగానో నవ్విస్తోంది.

"వరుణ్‌తేజ్‌-సాయిపల్లవిల జోడీ చూడచక్కగా ఉంటుంది. కాబట్టి వాళ్లిద్దరికి పెళ్లి చేసేస్తా" అంటూ ఓ నెటిజన్‌ నాగబాబుకు పోస్ట్‌ పెట్టాడు. దానిపై స్పందించిన ఆయన 'జాతిరత్నాలు' చిత్రంలో బ్రహ్మానందం చెప్పే.. "తీర్పు కూడా మీరే ఇచ్చుకోండ్రా. అరేయ్‌ మనమెందుకు ఇక్కడ వెళ్లిపోదాం రండి" అనే వీడియోతో నెటిజన్‌కు కౌంటర్‌ వేశారు. మరోవైపు, ఇటీవల కాలంలోనే "వరుణ్‌ అన్నకు పెళ్లి ఎప్పుడు చేస్తారు?" అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. "మంచి సంబంధాలు ఉంటే చూడండి" అని నాగబాబు సమాధానమిచ్చారు.

Nagababu counter to netizen who asked for Varun Tej and Saipallavi wedding
నాగబాబు

శేఖర్‌కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' కోసం వరుణ్‌తేజ్‌-సాయిపల్లవి మొదటిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. ఈసినిమాలో వీళ్లిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ యువతను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి ప్రాజెక్ట్‌ల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. ఓ వైపు 'గని' షూట్‌లో వరుణ్‌తేజ్‌ పాల్గొంటుండగా.. 'లవ్‌స్టోరి', 'విరాటపర్వం', 'శ్యామ్‌ సింగరాయ్‌' పనుల్లో సాయిపల్లవి బిజీగా ఉంటున్నారు.

ఇదీ చూడండి: సుశాంత్​ బయోపిక్​ తెరకెక్కించనున్న ఆర్జీవీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.