ETV Bharat / sitara

ఇచ్చిన మాట కోసం ఆ తప్పు చేశాను: నాగశౌర్య - entertainment news

త్వరలో 'అశ్వథ్థామ'గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు హీరో నాగశౌర్య. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ చిత్రవిశేషాలను పంచుకున్నాడు. ఈ శుక్రవారం థియేటర్లలోకి రానుందీ సినిమా.

ఇచ్చిన మాట కోసం ఆ తప్పు చేశాను: నాగశౌర్య
హీరో నాగశౌర్య
author img

By

Published : Jan 29, 2020, 8:04 AM IST

Updated : Feb 28, 2020, 8:59 AM IST

ప్రేమకథలకు సరిగ్గా సరిపోతాడు హీరో నాగశౌర్య. తనకు విజయాల్ని అందించిన సినిమాలన్నీ లవ్‌ స్టోరీలే. 'ఊహలు గుసగుసలాడే' నుంచి 'ఛలో' వరకూ ఓ అల్లరి ప్రేమికుడిగా మురిపించాడు. అయితే మధ్యలో మాస్‌ ప్రయత్నాలు చేయడం మానలేదు. అందులో 'జాదూగాడు' ఒకటి. ఇప్పుడు మరోసారి ఓ విభిన్నకథను ఎంచుకున్నాడు. అదే 'అశ్వథ్థామ'. ఐరా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించాడు ఆ విశేషాలివే.

ఈ కథ కోసం మీరు చేసిన కసరత్తు ఏంటి?

దేశమంతా తిరిగాను. ఎక్కడెక్కడ ఎలాంటి అకృత్యాలు జరిగాయో తెలుసుకునే ప్రయత్నం చేశాను. బాధితులతో మాట్లాడాను. కొంతమంది నా మొహం మీదే తలుపులేశారు. మాట్లాడడానికి ఇష్టపడలేదు. వాళ్ల జీవితాల్ని ఆ ఘటనలు అంతగా అతలాకుతలం చేశాయన్నమాట. ఈ ప్రయాణంలో నన్ను నేను తెలుసుకున్నాను. వ్యక్తిగా చాలా మారాను. అందుకే ఈ సినిమా నా మనసుకు చేరువైంది. ఈ జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉండాలని సినిమా పేరును పచ్చబొట్టుగా పొడిపించుకున్నాను.

దర్శకత్వం చేయాలన్న ఆలోచన రాలేదా?

లేదు. నేను కేవలం కథకుడిగానే ఆలోచించాను. రమణ తేజ ఈ చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దాడు. పైగా ముందు నుంచీ ఈ కథతో పాటు తను ప్రయాణం చేస్తూ వచ్చాడు. తన ఆలోచనలు బాగా ఉపయోగపడ్డాయి. సెట్‌కు వెళ్లే ముందే ఏ సన్నివేశం ఎలా తీయాలి? ఎలాంటి లెన్సులు వాడాలి? అనే విషయాలపై చాలా కసరత్తు చేశాం. పేపర్‌లో రాసుకున్నదే తెరపై తీశాం.

naga shourya
హీరో నాగశౌర్య

'ఖైదీ', 'ఖాకీ' ఛాయలు కనిపిస్తున్నాయి. ఆ జోనర్‌లో సాగే సినిమానా?

ఆ ప్రభావం 'అశ్వథ్థామ'పై ఉంది. ఎందుకంటే అవన్నీ నిజాయతీగా తీసిన సినిమాలు. కమర్షియల్‌ హంగుల కోసం పాటలు, ఫైట్లు పెడదాం అని ఆలోచించలేదు. 'అశ్వథ్థామ' విషయంలోనూ అదే జరిగింది. తెరపై కనిపించిన ప్రతి పాత్రకూ, ప్రతి సన్నివేశానికీ ఓ అర్థం ఉంటుంది.

మీకు ప్రేమకథలు బాగా నప్పుతాయి కదా, జోనర్‌ మార్చాలనుకుంటున్నారా?

ప్రేమకథలు చేసీ చేసీ బోర్‌ కొట్టింది. రోజా పువ్వు పట్టుకోవడం, ఐ లవ్‌ యూ అంటూ అమ్మాయి వెంట పడడం, తాను కాదంటే, ఓ విషాద గీతం వేసుకోవడం... ఇదే జరుగుతోంది. షూటింగ్‌కు వెళ్తున్నాను అనే ఉత్సాహం లేకుండా పోతోంది. 'నాగశౌర్య అన్నీ చేయగలడు..' అని నిరూపించాలన్న ప్రయత్నం నాది.

naga shourya-mehreen
'అశ్వథ్థామ' సినిమాలో నాగశౌర్య-మెహరీన్

ప్రేమకథల్లోనూ కొత్త కోణాలు చూపించొచ్చు కదా?

ఇప్పుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అలాంటిదే. నా పాత్రలో ఏకంగా ఏడు కోణాలుంటాయి. అవేంటన్నది చాలా ఆసక్తికరం. చేస్తే.. అలాంటి ప్రేమకథలే చేయాలి.

రాఘవేంద్రరావు నిర్మాణంలో క్రిష్‌ దర్శకుడిగా ఓ సినిమా చేస్తారని వార్తలొచ్చాయి..?

అవును. ఆ సినిమా తప్పకుండా ఉంటుంది. కథ విషయంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి.

మీ సంస్థలో వేరే హీరోలతో సినిమాలు చేస్తారా?

ప్రస్తుతం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఓ కథ రాస్తున్నా. రెండు మూడు నెలల్లో సినిమా మొదలవుతుంది. హీరో ఎవరన్నది కథ రాశాకే తెలుస్తుంది.

naga shourya in ashwathama cinema
'అశ్వథ్థామ'లో హీరో నాగశౌర్య

ఈ చిత్రానికి 'అశ్వథ్థామ' అనే పేరు పెట్టడానికి కారణమేంటి?

ద్రౌపది చీర లాగుతున్నప్పుడు అందరూ వినోదం చూస్తే... అశ్వథ్థామ ఒక్కడే ప్రశ్నించాడు. ఆ ప్రశ్నించే గుణంలోంచే ఈ కథ పుట్టుకొచ్చింది. అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలకు ఎదురొడ్డే కుర్రాడి కథ ఇది. అందుకే ఆ పేరు పెట్టాం.

ఈ కథ రాయడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏంటి?

ఏ రోజు పేపర్‌ చూసినా ఏదో వార్త మనల్ని కదిలిస్తూనే ఉంటుంది. ఈమధ్య దిశ ఘటన అలాంటిదే. మన దృష్టికి రాకుండా ఇలాంటి అన్యాయాలు ఇంకెన్ని జరుగు తున్నాయో..? నా స్నేహితుడి జీవితంలో జరిగిన ఘటన చాలా కదిలించింది. అది చెబితే 'ఇలాక్కూడా జరుగుతుందా?' అని ఆశ్చర్యపోతారు. ఓ వ్యక్తిగా నేనేమీ చేయలేకపోవొచ్చు. కానీ ఇలాంటి సినిమాల ద్వారా కొంతమందినైనా జాగృతం చేయాలనుకుంటున్నాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'నర్తనశాల' నన్ను చాలా నిరాశ పరిచింది. ఇంట్లో ఎవరైనా చనిపోతే... ఎలాంటి వాతావరణం ఉంటుందో, సరిగ్గా అంతే విషాదాన్ని ఏకంగా ఆరు నెలలు మా ఇంట్లో చూశాను. డబ్బులు పోయినందుకు ఏనాడూ ఆలోచించలేదు. కానీ అమ్మానాన్నలను తలదించుకునేలా చేశానే అని బాధ పడ్డాను. వాళ్లు నన్నెప్పుడూ నిందించలేదు. 'మా అబ్బాయికి ఓ ఫ్లాప్‌ ఇచ్చామే' అని వాళ్లు బాధ పడ్డారు. అది నన్ను మరింత బాధపెట్టింది. 'నర్తనశాల' ఆడదని నాకు ముందే తెలుసు. కానీ ఇచ్చిన మాట కోసం చేసిన సినిమా అది. ఒకరికి మాటిచ్చాను, అది నిలబెట్టుకోకపోతే ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అందుకే ఆ తప్పు చేయాల్సివచ్చింది. ఇంకెప్పుడూ అలాంటి పొరపాటు చేయను. హిట్టూ, ఫ్లాపూ మన చేతుల్లో లేదు. కానీ మంచి సినిమాలు, మన గౌరవాన్ని పెంచే కథలు చేయొచ్చు కదా? 'అశ్వథ్థామ' అలాంటి సినిమానే.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Lima - 28 January 2020
1. Keiko Fujimori arriving by car outside court, enters building through crowds of media
2. Various of Fujimori surrounded by media
3. Fujmori enters courtroom and hugs lawyer Giuliana Loza
4. Fujimori seated next to Loza (their backs are to the camera) listening to Judge Victor Zuniga
5. SOUNDBITE (Spanish) Victor Zuniga, Judge:
"I impose preventative prison for a period of 15 months to investigate Keiko Sofia Fujimori Iguchi who is identified by her national identity document, number 10001088."
6. Fujimori being embraced by her husband Mark Vito Villanella  
7. People inside the courtroom standing after Fujimori is sentenced
8. People outside courtroom gathered to protest against Keiko Fujimori chanting (Spanish) "Justice and dignity, Fujimori never again."
9. Police and protesters outside court building
10. Anti-Fujimori protesters and police outside courthouse
11. Media surround Fujimori's husband outside courthouse
12. SOUNDBITE (Spanish) Mark Vito Villanella, Keiko Fujimori's husband:
"We will find justice and this is not the final word. That is the first thing and we will raise our voice in the face of international impunity because of this injustice."
13. Various of anti-Fujimori protesters standing outside the courtyard
STORYLINE:
Peruvian opposition leader Keiko Fujimori was sentenced to 15 months in prison on Tuesday over a money laundering investigation.
Judge Victor Zuñiga ruled that Fujimori, 44, must be imprisoned while prosecutors investigate her alleged participation in a money laundering scheme tied to Odebrecht, the Brazilian construction firm that has confessed to paying out almost one billion dollars in bribes to South American governments.
Prosecutors argue that Fujimori illegally received more than a million dollars from Odebrecht for one of her presidential campaigns, and hid it through a complex network of frontmen.
There were chaotic scenes as Fujimori arrived at the court building amid crowds of protesters and a media scrum.
After the ruling, her husband Mark Vito Villanella said justice had not been done.
Fujimori had already spent a year in jail, but was released in November thanks to a ruling by Peru's constitutional court, which argued that she had lost the capability to interfere in the ongoing investigation.
The court appearance came just a few days after her Popular Force party was trounced in Peru's congressional elections.
The party went from having 72 seats in Peru's congress to 12 in what analysts have said is a major setback for the Fujimori political dynasty.
Fujimori's father, Alberto, is a former Peruvian president who was sentenced to 25 years in prison for committing human rights abuses.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 28, 2020, 8:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.