ETV Bharat / sitara

Thank you movie: ఓటీటీలో 'థాంక్యూ'?.. చిత్రబృందం క్లారిటీ - Thank you movie OTT

చైతూ 'థాంక్యూ' సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారనే వార్తలపై టీమ్​ స్పష్టతనిచ్చింది. ఈ చిత్రం వెండితెరపైనే చూపించాలని అనుకుంటున్నామని వెల్లడించింది.

Naga Chaitanya Thank you movie
నాగచైతన్య థాంక్యూ మూవీ
author img

By

Published : Dec 8, 2021, 3:42 PM IST

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా 'థ్యాంక్యూ'. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై గత కొన్నిరోజుల నుంచి పలు వార్తలు వైరల్​గా మారాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ వేదికగా విడుదల చేయనున్నారని అందరూ చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ వార్తలన్నింటికీ చెక్‌ పెడుతూ చిత్రబృందం బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ చిత్రాన్ని థియేటర్‌లోనే విడుదల చేయనున్నామని తెలిపింది.

Naga Chaitanya Thank you movie
థాంక్యూ మూవీ రిలీజ్​పై టీమ్ క్లారిటీ

"థ్యాంక్యూ సినిమా నిర్మాణం చివరి దశలో ఉంది. వెండితెరపైనే మా చిత్రాన్ని చూపించాలని అంకితభావంతో దీన్ని నిర్మిస్తున్నాం. సరైన సమయంలో థ్యాంక్యూ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తాం" అని చిత్రబృందం ఓ ఫొటో పోస్ట్ చేసింది.

విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా ఈ సినిమాను తీస్తున్నారు. ఇందులో చైతూకు జోడీగా రాశీఖన్నా నటిస్తుంది. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.