'వైల్డ్ డాగ్' కోసం ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ విజయ్‌వర్మగా మారిపోయాడు కింగ్ నాగార్జున. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారట. త్వరలోనే వీరి ఎంపిక పూర్తి చేసి, వారిపై సీన్స్‌ను తీయనున్నారు.
ఇందులో ఏసీపీ విజయ్ వర్మ ఉరఫ్ 'వైల్డ్ డాగ్'గా నాగార్జున చేసే సాహసాలు ఆకట్టుకుంటాయని చిత్రబృందం తెలిపింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీస్తున్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: నాలుగు నెలల గర్భంతో 'స్నేహ' సాహసాలు