ప్రతీ మూడేళ్లకొకసారి జరిగే దక్షిణాది నటీనటుల సంఘం(నడిగర్ సంఘం) ఎన్నికలు తమిళనాడులో ప్రశాంతంగా జరుగుతున్నాయి. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నటుడు విశాల్, రచయిత భాగ్యరాజ్ వర్గాలు ప్రధాన పోటీదారులు. ప్రస్తుతం ఈ సంఘానికి అధ్యక్షుడిగా నాజర్, కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తీ కొనసాగుతున్నారు.
అంతా గొడవ గొడవ
సంఘం నుంచి తొలిగించిన 61 మంది సభ్యుల ఫిర్యాదు మేరకు ఎన్నికల్ని రద్దు చేస్తున్నట్టు తొలుత మద్రాస్ హైకోర్టు పేర్కొంది. కానీ ఆదివారం ఎన్నికలు నిర్వహించేందుకు అనుమతిచ్చింది. కానీ ఈ విషయంపై తదుపరి విచారణ జూలై 8వ తేదీకి వాయిదా పడింది. అప్పటి వరకు ఫలితాలు ప్రకటించడానికి వీల్లేదని చెప్పింది. ఇలాంటి పరిస్థితుల మధ్య తమిళ సినీ పరిశ్రమ ఎవరివైపు నిలబడుతుందో చూడాలి.
ఈ ఎన్నికలు అర్థ బలానికి, నిజాయితీకి మధ్య జరుగుతున్న పోటీ అని నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ అన్నారు. కోర్టు జోక్యం చేసుకుని ఎన్నికలు నిర్వహించటం శుభపరిణామమని అన్నారు. ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టడం సాధ్యం కాదని, అందరినీ సంతృప్తి పరచలేమని అన్నారాయన.
ఇది చదవండి: టర్కీలో షూటింగ్... హీరో విశాల్‌కు గాయాలు