'ఇస్మార్ట్ శంకర్'లో పక్కా తెలంగాణ అమ్మాయి పాత్రలో కనిపిస్తానని.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని నభా నటేష్ చెప్పింది. ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా నభా నటేష్ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడింది.
"తెలుగులో నా తొలి చిత్రం 'నన్ను దోచుకుందువటే' మంచి గుర్తింపు తీసుకొచ్చింది. 'ఇస్మార్ట్ శంకర్'లో పక్కా తెలంగాణ అమ్మాయిగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం తెలంగాణ భాష నేర్చుకున్నా. నేను నేర్చుకున్నా తెలుగు డబ్బింగ్ చెప్పడానికి సరిపోదు. అందుకే ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పలేకపోయాను. కథ ప్రకారం చాందిని.. శంకర్‌తో ప్రేమలో పడుతుంది. ఆ పిచ్చి ప్రేమతో కోపాన్ని ఆపుకోలేక తరచూ శంకర్‌ని కొడుతుంది. పూరి సినిమాలో నటించడం ఓ వరం లాంటిది. నేనూ నిధి అగర్వాల్ కలిసి నటించిన సన్నివేశం ఒక్కటీ లేదు. ఓ పాటలో మాత్రం తనతో కలసి డాన్స్ చేశానంతే" అని తెలిపింది.
‘నభా నటేష్ ప్రస్తుతం రవితేజతో 'డిస్కోరాజా' చిత్రంలో నటిస్తోంది. మరో రెండు పెద్ద సంస్థలు తీసే తెలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో ఒక చిత్రంలో నటించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి.. వెబ్ సిరీస్, ఫ్రెంచ్ కామెడీ రీమేక్‌లో సమంత