ETV Bharat / sitara

నాకు నచ్చిందే దొరుకుతోంది: నభా నటేష్ - నభా సాయి తేజ్

ఎప్పుడూ కొత్తగా ఏదైనా చెయ్యాలని ఉంటుందని అంటోంది హాట్​బ్యూటీ నభా నటేష్​. టాలీవుడ్​లో ఇప్పటివరకు తాను కోరుకున్న పాత్రలే దక్కుతున్నాయని చెబుతోంది. తాను నటించిన సినిమాలు ఇలా వరుసగా విడుదల కావడం సంతోషంగా ఉందని వెల్లడించింది.

Nabha Natesh about her latest movies and interests
నాకు నచ్చిందే దొరుకుతోంది: నభా
author img

By

Published : Jan 13, 2021, 6:52 AM IST

"నటిగా నేను చాలా అదృష్టవంతురాల్ని. ప్రతి సినిమాలోనూ నటనకి అవకాశం ఉన్న పాత్రలు దక్కుతున్నాయి. రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి... కొత్తగా ఇంకేదైనా చేయాలనే తపన నాలో ఎప్పుడూ ఉంటుంది. అలాంటి కథలే నా దగ్గరికి వస్తున్నాయి" అంటోంది కథానాయిక నభా నటేష్‌. థియేటర్లు తెరిచాక వరుసగా సినిమాలతో సందడి చేస్తోందీమె. గత నెలలో వచ్చిన 'సోలో బ్రతుకే సో బెటర్‌'లో అమృతగా అలరించింది నభా. సంక్రాంతి సందర్భంగా గురువారం విడుదలవుతున్న 'అల్లుడు అదుర్స్‌'లోనూ ఓ కథా నాయికగా నటించింది. ఈ సందర్భంగా నభా నటేష్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది.

Nabha Natesh about her latest movies and interests
'సోలో బ్రతుకే సో బెటర్', 'అల్లుడు అదుర్స్'

వరుసగా మీ సినిమాలు విడుదలవుతున్నాయి. ఉత్సాహంగా ఉన్నట్టున్నారు?

కొంచెం ఉత్సాహం, ఉత్కంఠ (నవ్వుతూ). మామూలుగా సినిమా సినిమాకీ మూడు నెలలైనా విరామం ఉంటుంది. ఈసారి వెంట వెంటనే వస్తున్నాయి. దాంతో 'సోలో...' విజయాన్ని ఆస్వాదించేలోపే, 'అల్లుడు అదుర్స్‌' విషయంలో ఆత్రుత మొదలైంది. 2020 నాకు ఎలాగైతే సుఖాంతమైందో, ఈ యేడాది అలాగే ఆరంభం అవుతుంది. కుటుంబమంతా కలిసి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుంది. మంచి కథ... దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ దాన్ని నడిపించిన విధానం నాకు బాగా నచ్చాయి.

నభా

ఇందులో మీ పాత్ర ఎలా ఉండబోతోంది?

చాలా భిన్నంగా ఉంటుంది. ఇందాక ఇలా కనిపించింది, అంతలోనే ఇలా ఏంటి అని ఆశ్చర్యపోతారు. పాత్ర సాగే విధానంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. ఒక నటిగా నేను ఏది చేయాలనుకున్నానో అది ఇందులో చేశా. నాకు ఈత రాదు కానీ, స్విమ్మర్‌గా కనిపిస్తాను. పగలు చిత్రీకరణలో పాల్గొంటూ, రాత్రిళ్లు ఈత కొట్టడం నేర్చుకుని ఇందులో నటించా.

క్యూట్​లుక్​లో

'అంధాదున్‌' రీమేక్‌లో నటిస్తున్నారు కదా, ఆ అనుభవం ఎలా ఉంది?

రెండు రోజులు ఆ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నా. జాతీయ స్థాయిలో ప్రేక్షకుల్ని అలరించి, పురస్కారాలు గెలుచుకున్న సినిమా అది. సెట్‌కి వెళ్లే ముందు భయపడ్డా. వెళ్లాక... దర్శకుడు మేర్లపాక గాంధీ స్పష్టత చూసి ధైర్యం వచ్చింది. సవాల్‌తో కూడిన పాత్ర అది. నాకు నచ్చిందే తెలుగులో దొరుకుతోంది.

హాట్​బ్యూటీ

దానితో ఒత్తిడి దూరం..

"నేను ఇంట్లో చాలా సౌకర్యంగా గడుపుతా. బయటకి వెళ్లాలని పెద్దగా అనిపించదు. అందుకే లాక్‌డౌన్‌ సమయంలో ఇబ్బంది పడలేదు. మూడు నెలల తర్వాత కొంచెం భయంగా అనిపించింది. ఆ సమయంలో నేను చిత్రలేఖనంపై దృష్టి పెట్టా. ఓ పెద్ద చార్లీ చాప్లిన్‌ బొమ్మ వేస్తున్నా. దానికి ఇంకా తుదిమెరుగులు దిద్దాలి. ఎలాంటి ఒత్తిడి ఎదురైనా.. అదొక థెరపీలాగా పనిచేస్తుంది."

ఇదీ చూడండి: 'ఆ మాట విన్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.