అశోక్ సెల్వన్, నిత్యా మేనన్, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'నిన్నిలా నిన్నిలా'. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం నవ్విస్తున్న ప్రచారం చిత్రం సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఈ సినిమా ఫిబ్రవరి 26న జీప్లెక్స్ ఓటీటీ వేదికగా విడుదలవనుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
అల్లరి నరేశ్ కీలకపాత్రలో నటిస్తున్న చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకుడు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఫిబ్రవరి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
![Naandhi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10507153_sa.jpg)