ETV Bharat / sitara

ఆయన పాటలకు మనసు కరగాలా.. గుండె కదలాలా! - ఇళయరాజా పుట్టినరోజు ప్రత్యేక కథనం

సంప్రదాయ వాద్య పరికరాలతో వినసొంపైన సంగీతం సమకూర్చగలిగే నేర్పరి. సప్తస్వరాలను మనసులకు ముడిపెట్టగలిగే గానగాంధర్వుడు​. కోయిల పాటను మించిన కమ్మని స్వరం ఆయన సొంతం. అందుకే ఆయన రాగాలకు కరగని మనసుండదు... కదలని గుండె ఉండదు. అందరూ గౌరవంగా సంగీత మేస్ట్రో అని పిలుచుకుంటారు. ఆయనే ఇళ‌య‌రా‌జా. నేడు ఈయన 77వ పుట్టినరోజు సందర్భంగా కొన్ని విశేషాలు మీకోసం.

Musical Mastreo Ilayaraja Birthday special story
లండన్​లోని సింఫనీ నిర్వహించిన తొలి సంగీత దర్శకుడు
author img

By

Published : Jun 2, 2020, 5:26 AM IST

చిత్రగాన కల్ప‌వృ‌క్షా‌నికి ఫల‌పు‌ష్ప‌భ‌రి‌త‌మైన కొమ్మ‌లెన్నో! అందులో ఇళ‌య‌రాజా ఒక చిటా‌రు‌కొమ్మ.‌ ‌"నాభి‌హృ‌త్కం‌ఠ‌ ర‌స‌నల ద్వారా ఉద్భ‌వించి ఉరి‌కి‌వచ్చే సప్త‌స్వర సుంద‌రు‌లను భజిం‌చిన నాద‌యో‌గు‌లలో ఇళ‌య‌రాజా ఒకరు"‌ అంటూ వేటూరి సుంద‌ర‌రా‌మ‌మూర్తి ఇళ‌య‌రా‌జాను కీర్తిం‌చారు.‌ ‌"సహ‌జ‌మైన సంప్రదాయ వాద్య‌ప‌రి‌క‌రా‌లతో సంగీతం సమ‌కూ‌ర్చితే అందులో మనకు ఆత్మ కని‌పి‌స్తుంది.‌ యంత్రా‌లతో సంగీతం అంటే ఎప్పుడూ యాంత్రి‌కం‌గానే ఉంటుంది.‌ యాదృచ్ఛికంగా వచ్చేదే సంగీతం.‌ దానికో సమయం అంటూ ఉండదు.‌ అప్పుడే పుట్టిన పసి‌పా‌పలా ఉండేదే సంగీ‌త‌మంటే.‌ విన‌గానే కొత్తగా ఉండాలి.‌.‌.‌ వినే శ్రోతకి కొత్త అను‌భూ‌తిని పంచాలి"‌ అనేది ఇళ‌య‌రాజా నమ్మిన సిద్ధాంతం.‌ మన‌సుకు నచ్చని పని ఇళ‌య‌రాజా ఎప్పుడూ చేయలేదు.‌ హింసా ‌నే‌ప‌థ్యంతో ఒక కథను కమ‌ల‌హా‌సన్‌ విని‌పిస్తే రాజా ఆ సిని‌మాకు సంగీతం చేయలేనని చెప్పారు.‌ తనను ఒప్పించ‌లేని కథకు రాజా సంగీతం ఇవ్వ‌లేదు.‌ అటు‌వంటి సంగీత మేస్ట్రో ఇళ‌య‌రా‌జా రాజా గురించిన కొన్ని విశే‌షాలు తెలు‌సు‌కుందాం.‌.‌.‌

Musical Mastreo Ilayaraja Birthday special story
ఇళయరాజా

ఇళ‌య‌రాజా అసలు పేరు జ్ఞాన‌దే‌శి‌కన్‌.‌ తమి‌ళ‌నా‌డు‌లోని తెన్ని జిల్లా పణైన‌పు‌రంలో జూన్‌ 2, 1943న జన్మించారు.‌ తండ్రి రామ‌స్వామి, తల్లి చిన్న‌త్తా‌య‌మ్మాళ్‌.‌ వారిది తమి‌ళ‌నాడు−‌ కేరళ సరి‌హద్దు గ్రామం కావ‌డం వల్ల రామ‌స్వామి కేరళ తేయాకు తోటల్లో సూప‌ర్‌వై‌జ‌ర్‌గా పని‌చే‌సే‌వారు.‌ అత‌నిపై అధి‌కారి ఆంగ్లేయ దొర.‌ అతని ప్రోద్బ‌లంతో రామ‌స్వామి క్రైస్తవ మతం స్వీక‌రించారు.‌ అప్పుడు జ్ఞాన‌దే‌శి‌కన్‌ పేరును డేని‌యల్‌ రాజయ్య (రాజా)గా మార్చారు.‌ రాజా తన మేన‌మామ ఇంటి‌వద్ద ఉంటూ చదు‌వు‌కొసా‌గించారు.‌ కుటుంబ ఆర్థిక పరి‌స్థితి సహ‌క‌రిం‌చక పోవ‌డం వల్ల చదు‌వుకు స్వస్తి చెప్పి కూలీ పని‌చే‌శారు.‌ మదు‌రైలో వైగై నది మీద ఆన‌కట్ట నిర్మాణం జరి‌గి‌న‌ప్పుడు, ఆ ఆన‌కట్ట కోసం రాళ్లె‌త్తిన కూలీ‌లలో రాజయ్య కూడా ఒకరు.‌ అప్పుడే వ్యవ‌సాయ కూలీలు పాడు‌కొనే ఏల‌పా‌టలు, కార్మి‌కులు పాడు‌కొనే జాన‌పద గీతాలు రాజ‌య్యకు కంఠో‌పా‌ఠ‌మ‌య్యాయి.‌ రాజా పాడడం గమ‌నించిన ఒక ఇంజ‌నీర్‌ అతన్ని తన వద్ద నౌక‌రుగా నియ‌మిం‌చు‌కొని వారా‌నికి 7 రూపా‌యల జీతం ఇచ్చే‌వాడు.‌ ఈ రోజు కోట్లకు పడ‌గె‌త్తినా తన మొదటి సంపా‌దన ఇచ్చిన ఆనందం మర‌చి‌పో‌లే‌ని‌దని అంటుంటారు ఇళ‌య‌రాజా.‌ తర్వాత కమ్యూ‌నిస్టు పార్టీ ప్రచార కార్య‌క్రమాల్లో ప్రజ‌లను ఉత్తే‌జ‌ప‌ర‌చేలా రాజా పాటలు పాడే‌వారు.‌

సంగీత దర్శ‌కు‌నిగా రాజా తొలి అడు‌గులు

ఇళ‌య‌రా‌జాకు ‌'దీపం' అనే తమిళ చిత్రా‌నికి సంగీత దర్శ‌కత్వం నిర్వ‌హించే అవ‌కాశం వచ్చినా దాని నిర్మాణం ఆగి‌పో‌యింది.‌ జెమినీ సంస్థ చిత్రా‌నికి సంగీతం అందించే అవ‌కాశం అంది‌నట్లే అంది దక్క‌కుండా పోయింది.‌ 1976లో పంజు అరు‌ణా‌చలం అనే నిర్మాత గ్రామీణ నేప‌థ్యంలో ‌'అణ్ణ‌క్కిళి' సినిమా నిర్మిస్తూ ఇళ‌య‌రా‌జాకు తొలి అవ‌కాశం ఇచ్చారు.‌ శివ‌కు‌మార్, సుజాత నటించిన ఆ సిని‌మాకు ఇళ‌య‌రాజా అందిం‌చిన సంగీతం వినూ‌త్నంగా, విభి‌న్నం‌గానూ ఉండ‌టం వల్ల సంగీ‌తా‌భి‌మా‌ను‌లను సంభ్రమా‌శ్చ‌ర్యా‌లకు గురి‌చే‌సింది.‌ అందులో ఎస్‌.‌జా‌నకి ఆల‌పిం‌చిన ‌'మచ్చానై పార్తిం‌గళా మలై‌వాళ తోప్పు‌క్కుళ్ళే'‌ (తెలు‌గులో ‌'మావయ్య వస్తా‌డంటా మన‌సిచ్చి పోతా‌డంటా'−‌ రామ‌చి‌లక సిని‌మాలో) పాటకు ప్రేక్ష‌కులు లేచి నిల‌బడి డ్యాన్స్‌ చేసే‌వారు.‌ పియానో, గిటార్‌ వంటి పాశ్చాత్య వాద్య పరి‌క‌రా‌ల‌మీద హంస‌ధ్వని, రీతి గౌళ, మోహన వంటి కర్ణాటక సంప్రదాయ రాగా‌లను మేళ‌వించి స్వర‌ప‌ర‌చ‌డం వల్ల సంగీత ప్రియు‌లకు ఏదో కొత్త‌దనం గోచ‌రించి, క్రమంగా రాజాకు అభి‌మా‌నులై పోయారు.‌ ‌'నిళ‌ల్గళ్‌'‌, ‌'ఆరి‌ళి‌రిందు అరు‌వ‌త్తు‌వరై', ‌'నేట్రి‌కన్‌', ‌'మూదు‌పాణి', ‌'నింజతై కిలాత్తే' వంటి సిని‌మా‌ల్లోని పాటలు సూపర్‌ హిట్లుగా నిల‌వ‌డం వల్ల రాజా పేరు తమి‌ళ‌నాట మారు‌మో‌గి‌పో‌యింది.‌ భార‌తీ‌రాజా−‌ఇళ‌య‌రాజా కాంబి‌నే‌షన్లో ఎంతో అద్భు‌త‌మైన పాటలు వచ్చాయి.‌

తెలుగు తెర‌మీద ఇళ‌య‌రా‌జీయం

ఇళ‌య‌రాజా 1977లో వచ్చిన ‌'భద్రకాళి'‌ సిని‌మాతో తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు.‌ అందులో జేసు‌దాస్, సుశీల ఆల‌పిం‌చిన ‌'చిన్ని‌చిన్ని కన్నయ్యా'‌ పాట తెలుగు ప్రేక్ష‌కు‌లను అల‌రించింది.‌ తర్వాత వచ్చిన ‌'వయసు పిలి‌చింది'‌ సిని‌మా‌లోని అన్ని పాటలూ యువ‌త‌రా‌నికి కొత్త సంగీత టాని‌క్‌ను ఎక్కించి మత్తు‌లోకి నెట్టే‌శాయి.‌ హిందీలో విజ‌య‌వం‌త‌మైన ‌'డాన్‌' సిని‌మాను మేకప్‌ ఆర్టిస్టు పీతాం‌బరం తెలు‌గులో ‌'యుగం‌ధర్‌'‌ పేరుతో నిర్మిస్తే, ఇళ‌య‌రాజా తన‌దైన శైలిలో సంగీతం అందించి ఆ సిని‌మాను సూపర్‌ హిట్‌ చేశారు.‌ 'ఎర్రగు‌లా‌బీలు', 'అజే‌యుడు', 'పంచ‌భూ‌తాలు', 'కాళ‌రాత్రి' సిని‌మా‌ల‌లోని పాట‌లకు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయి‌పో‌యారు.‌ ఇక 1981లో వచ్చిన 'సీతా‌కో‌క‌చి‌లక' సినిమా పాటలు సంగీత అభి‌మా‌ను‌లను ఇళ‌య‌రాజా మత్తు‌లోకి దించే‌శాయి.‌ 'వసం‌త‌కో‌కిల', 'అమ‌ర‌గీతం', 'మధు‌ర‌గీతం', టిక్‌ టిక్‌ టిక్‌', 'పూల‌ప‌ల్లకి', 'కొత్త జీవి‌తాలు' సిని‌మా‌లలో పాటలు మారు‌మ్రో‌గి‌పో‌యాయి.‌ సరి‌కొత్త బాణీలు, వైవి‌ధ్య‌భ‌రిత సంగీతం యువ‌త‌రాన్ని గంగ‌వె‌ర్రు‌లె‌త్తిం‌చింది.‌ 'శివ', 'సాగ‌ర‌సం‌గమం', 'అభి‌లాష', 'రాజ‌కు‌మార్‌', 'మంత్రి‌గారి వియ్యం‌కుడు', 'సంకీ‌ర్తన' వంటి సిని‌మా‌ల‌లోని పాటల సంగతి చెప్పా‌ల్సిన పనే‌లేదు.‌

1984లో దర్శ‌కుడు వంశీతో ఇళ‌య‌రా‌జాకు పరి‌చ‌య‌మైంది.‌ ‌'సితార' ఆయనకు రెండ‌వ‌చిత్రం.‌ రీరి‌కా‌ర్డింగ్‌ కాకుండా డబుల్‌ పాజి‌టివ్‌ వేసి చూపిస్తే శ్రేయో‌భి‌లా‌షులు పెదవి విరి‌చారు.‌ వంశీ నిరాశ చెందారు.‌ ఇళ‌య‌రాజా దానికి రీ రి‌కా‌ర్డింగ్‌ చేసి విడు‌ద‌ల‌చేస్తే ఆ సినిమా సంచ‌ల‌నాన్ని సృష్టించింది.‌ వంశీ సిని‌మాలు 'లేడీస్‌ టైలర్‌', 'అన్వే‌షణ', 'ప్రేమించు−‌పెళ్లాడు', 'మహర్షి', 'చెట్టు‌కింద ప్లీడర్‌', 'ఏప్రిల్‌ 1 విడు‌దల', 'శ్రీ కనక మహా‌లక్ష్మి డ్యాన్స్‌ ట్రౌపే' అన్నీ సంగీ‌త‌ప‌రంగా సూపర్‌ హిట్లే.‌ 'ఛాలెంజ్‌', 'మాంగ‌ల్య‌బంధం', 'గీతాం‌జలి', 'శ్రీషిర్డీ సాయి‌బాబా మహా‌త్మ్యం', 'జ్వాల', 'రాక్ష‌సుడు', 'ఒక రాధ ఇద్ద‌రు‌కృ‌ష్ణులు' పెద్ద హిట్‌ సిని‌మాలు.‌ 'శివ' సిని‌మాకు ఇళ‌య‌రాజా వినూ‌త్న‌మైన సంగీ‌తాన్ని అందించారు.‌ సినిమా విజ‌య‌వంతం కాదని తనకు అని‌పించిన సంద‌ర్భాల్లో, ఇళ‌య‌రాజా నిర్మా‌తల్ని రీ రి‌కా‌ర్డింగ్‌ వంటి పను‌లకు ఎక్కు‌వగా ఖర్చు పెట్ట‌ని‌చ్చే‌వారు కాదు.‌ 1988 తర్వాత విడు‌ద‌లైన సిని‌మా‌లలో ఇళ‌య‌రాజా సంగీత పోక‌డలు కొత్త పుంతలు తొక్కాయి.‌

'రక్తా‌భి‌షేకం', 'జమ‌దగ్ని', 'వార‌సు‌డొ‌చ్చాడు', 'అభి‌నం‌దన', 'రుద్రవీణ', 'ఆఖరి పోరాటం', 'స్వర్ణ‌క‌మలం', 'మర‌ణ‌మృ‌దంగం', 'ఇంద్రుడు చంద్రుడు', 'ప్రేమ', 'విచిత్ర సోద‌రులు', 'బొబ్బి‌లి‌రాజా', 'కొండ‌వీటి దొంగ', 'కూలీ నెంబర్‌ 1', 'ఆదిత్య 369', 'అంజలి', 'ఓ పాపా లాలి', 'స్వాతి‌ముత్యం', 'తూర్పు సింధూరం' వాటిలో కొన్ని మాత్రమే.‌ తమి‌ళ‌నా‌డులో సినిమా విడు‌దల రోజున హీరో‌లతో సమా‌నంగా ఇళ‌య‌రాజా కటౌట్లు వెలి‌సేవి.‌ మ్యూజిక్‌ షాపులు ఇళ‌య‌రాజా పాటలు కొనే‌వా‌ళ్లతో నిండి‌పో‌యేవి.‌ భార‌తీ‌రాజా తొలి‌చిత్రం ‌'పదు‌నారు వయ‌ది‌నిలే'‌ (పర‌హా‌రేళ్ళ వయసు)లో ఉత్తమ గాయ‌నిగా ఎస్‌.‌ జాన‌కికి జాతీయ పుర‌స్కారం లభించింది ఇళ‌య‌రాజా సంగీత దర్శ‌క‌త్వం‌లోనే.‌ అలాగే గాయని చిత్రకు తొలి జాతీయ పుర‌స్కా‌రాన్ని తెచ్చి పెట్టిన ‌'సింధు‌భై‌రవి'‌ చిత్రా‌నికి సంగీతం సమ‌కూ‌ర్చిందీ ఇళ‌య‌రా‌జానే.‌‌

మరిన్ని విశే‌షాలు

  • 2005లో ఆసియా ఖండం నుంచి అఖండ వాద్య‌బృందంతో లండ‌న్‌లోని రాయల్‌ ఫిల్హా‌ర్మో‌నిక్‌ ఆర్కె‌స్ట్రాతో సింఫనీ నిర్వ‌హిం‌చిన తొలి సంగీత దర్శ‌కు‌డిగా ఇళ‌య‌రాజా పేరు చరి‌త్రపు‌ట‌ల‌కె‌క్కింది.‌ ‌'తిరు‌ వా‌నగం'‌ పేరుతో నిర్వ‌హిం‌చిన ఈ సింఫనీ ప్రాచీన తమిళ సంప్రదాయ సాహిత్య నేప‌థ్యంగా సాగింది.‌ ఐదు‌సార్లు గ్రామీ పుర‌స్కారం అందు‌కున్న సౌండ్‌ ఇంజ‌నీర్‌ రిచర్డ్‌ కింగ్, ఆస్కార్‌ పురు‌స్కార గ్రహీత స్టీఫెన్‌ షెనా‌ర్ట్‌ రాజా వాద్య‌బృందంలో ఉండి సింఫ‌నీకి సహ‌క‌రిం‌చడం, రాజాకు గొప్ప అను‌భూ‌తి‌ని‌చ్చింది.‌
  • 'పంచ‌ముఖి'‌ పేరుతో కొత్త‌రా‌గాన్ని సృశించిన ఘనత ఇళ‌య‌రా‌జాదే.‌
  • లండన్‌ నగరం‌లోని ట్రినిటీ కాలేజ్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ నుంచి బంగారు పతకం సాధించిన సంగీత స్రష్ట (ఇసై‌జ్ఞాని) ఇళ‌య‌రాజా.‌
  • ఇళ‌య‌రాజా సంగీతం అందించిన సాగ‌ర‌సం‌గమం (తెలుగు), సింధు‌భై‌రవి (తమిళం), రుద్రవీణ (తెలుగు), కేర‌ళ‌వర్మ పళ‌స్సి‌రాజా (మళ‌యాళం) చిత్రా‌లకు జాతీ‌య‌స్థా‌యిలో ఇళ‌య‌రాజా ఉత్తమ సంగీత దర్శ‌కుని బహు‌మ‌తులు అందు‌కు‌న్నారు.‌ సీతా‌కో‌క‌చి‌లుక, రుద్రవీణ, జగ‌దే‌క‌వీ‌రుడు −‌ అతి‌లోక సుందరి, శ్రీరా‌మ‌రాజ్యం సిని‌మా‌లకు ఉత్తమ సంగీత దర్శ‌కు‌డిగా ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ నంది బహు‌మ‌తులు, ఆరు‌సార్లు తమిళ చిత్ర ఉత్తమ సంగీత దర్శ‌కుని బహు‌మ‌తులు ఇళ‌య‌రా‌జాకు దక్కాయి.‌ మూడు కేరళ ప్రభుత్వ బహు‌మ‌తులు, రెండు ఫిలింఫేర్‌ బహు‌మ‌తులూ ఇళ‌య‌రాజా పుచ్చు‌కు‌న్నారు.‌ 1988లో తమి‌ళ‌నాడు ప్రభుత్వం ప్రతి‌ష్టా‌త్మక ‌'కళై‌మా‌మణి' బిరు‌దుతో రాజాను సత్క‌రించింది.‌ 2010లో రాజాను భారత ప్రభుత్వం పద్మ‌భూ‌షణ్‌ బిరు‌దుతో సత్క‌రించింది.‌
  • ప్రేమించు పెళ్ళాడు చిత్రా‌నికి దరువు లేకుండా కేవలం గిటార్‌ తంత్రిని మీటి పాట రాయ‌మని వేటూ‌రిని కోరారు.‌ సన్ని‌వే‌శా‌నికి అదే మ్యూజిక్‌ బిట్‌ అవు‌తుం‌దనీ చెప్పారు.‌ అలా వెలు‌వ‌డిందే ‌'గోపెమ్మ చేతిలో గోరు‌ముద్ద.‌.‌ ‌రాధమ్మ చేతిలో వెన్న‌ముద్ద' పాట.‌
  • తన సంగీత గురువు జి.‌కె.‌ వెంక‌టే‌ష్‌కు అవ‌కా‌శాలు తగ్గిన రోజుల్లో తన వద్ద ఉంచు‌కుని ప్రతిరోజూ తొలి గౌరవ పారి‌తో‌షి‌కాన్ని అత‌నికి ఇచ్చి గురు‌దక్షిణ చెల్లిం‌చు‌కున్న మహా‌మ‌నిషి ఇళ‌య‌రాజా.‌

ఇదీ చూడండి... రికార్డులతో దూసుకెళ్తోన్న 'సర్కారు వారి పాట' ప్రీలుక్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.