సినిమా సినిమాకూ సరికొత్త లుక్స్‌తో కనిపించి, అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేస్తుంటాడు హీరో అల్లు అర్జున్. ఈ ప్రత్యేక లక్షణమే అతడిని తెలుగు ప్రేక్షకుల మదిలో స్టైలిష్ స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇందులో సరికొత్త లుక్‌లో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడు. సరికొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించనున్నాడు.
ఇందుకోసం ముంబయి నుంచి ప్రత్యేకంగా కేశాలంకరణ నిపుణులను పిలిపించనున్నారు. వారు ఇప్పటికే బన్నీ కోసం వివిధ హెయిర్ స్టైల్స్ సిద్ధం చేశారని, త్వరలో ఒకదానిని ఫైనల్ చేయనున్నారని తెలుస్తోంది.
ఈ సినిమా కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగనుంది. దానితో పాటే పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి.
![bunny](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6152910_rk4-2.jpg)
ఈ చిత్రం కోసం బన్నీ తొలిసారిగా చిత్తూరు యాసలో సంభాషణలు చెప్పబోతున్నాడు. ఇప్పటికే ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడట. ఇందులో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది.