బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న సందర్భంగా.. సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అయితే ఈ నటుడికి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పింది ముంబయి పోలీసు శాఖ.
"దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కించుకున్న 'ఇన్స్పెక్టర్ విజయ్'కు శుభాకాంక్షలు. ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్రలతో మెప్పించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన మీకు సెల్యూట్ చేస్తున్నాం" -ముంబయి పోలీసు సిబ్బంది ట్వీట్
-
Congratulations Inspector Vijay @SrBachchan on being selected for the #DadaSahebPhalke Award. We salute you for being the most evergreen, energetic and inspirational icon to generations. pic.twitter.com/mYp1JNdi7s
— Mumbai Police (@MumbaiPolice) September 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Congratulations Inspector Vijay @SrBachchan on being selected for the #DadaSahebPhalke Award. We salute you for being the most evergreen, energetic and inspirational icon to generations. pic.twitter.com/mYp1JNdi7s
— Mumbai Police (@MumbaiPolice) September 25, 2019Congratulations Inspector Vijay @SrBachchan on being selected for the #DadaSahebPhalke Award. We salute you for being the most evergreen, energetic and inspirational icon to generations. pic.twitter.com/mYp1JNdi7s
— Mumbai Police (@MumbaiPolice) September 25, 2019
1973లో వచ్చిన 'జంజీర్'.. అమితాబ్‌కు యాంగ్రీయంగ్‌మ్యాన్ గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఇన్స్పెక్టర్ విజయ్‌గా మెప్పించారు. 12 ఫ్లాప్‌లు తర్వాత వచ్చిన ఈ సినిమాతోనే బిగ్‌బీకి బాలీవుడ్లో బ్రేక్ వచ్చింది. ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించాడు.
50 ఏళ్ల సినీ ప్రస్థానంలో 'విజయ్' అనే పేరుతో 20 సినిమాల్లో నటించారు అమితాబ్. దీవార్, త్రిశూల్, కాలా పత్తర్, అగ్నిపథ్ లాంటి విజయవంతమైన చిత్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇదీ చదవండి: 'నేనూ తెలుగు వాడినే.. నా చిత్రాన్నీ చూడండి'